ఆగస్టు 9 నుండి ఇంజనీరింగ్ రెండవ దశ కౌన్సెలింగ్

తెలంగాణ జ్యోతి/ వెబ్ న్యూస్: రాష్ట్రంలోని ఇంజనీరింగ్‌ కోర్సుల్లో సుమారు 12 వేల సీట్లు మిగిలాయి. సివిల్‌మెకానికల్‌ విభాగాల్లో చేరడానికి విద్యార్థులు ఆసక్తి చూపడం లేదు. ఎంసెట్‌ కౌన్సెలింగ్‌లో భాగంగా మొదటి దశ సీట్ల కేటాయింపు ఆదివారం చేశారు. కన్వీనర్‌ కోటాలో మొత్తం 82,666 ఇంజనీరింగ్‌ సీట్లు ఉండగాప్రస్తుతం ఇందులో 70,665 సీట్లను కేటాయించారు. ఇంకా 12,001 సీట్లు భర్తీ కాకుండా మిగిలాయి. మొత్తం సీట్లలో 85.48 శాతం భర్తీ అయ్యాయి. 75,708 మంది విద్యార్థులు వెబ్‌ ఆప్షన్లు నమోదు చేసుకున్నారు. ఇందులో 70,665 మందికి సీట్లు కేటాయించారు. ప్రభుత్వ యూనివర్సిటీ కాలేజీల్లో 85.12 శాతంప్రైవేట్‌ యూనివర్సిటీల్లో 75.08 శాతంప్రైవేట్‌ కాలేజీల్లో 85.71 శాతం సీట్లు భర్తీ అయ్యాయి. 5,576 మంది విద్యార్థులకు ఈడబ్ల్యూఎస్‌ కోటా కింద సీట్లు కేటాయించారు. సీట్లు పొందిన అభ్యర్థులు ఈ నెల 22లోపు ఫీజు చెల్లించిఆయా కాలేజీల్లో రిపోర్టింగ్‌ చేయాల్సి ఉంటుంది. విద్యార్థులు ఇప్పటికే దోస్త్‌ ద్వారా డిగ్రీ కోర్సుల్లో చేరినట్టేయితే ఆ సీటును వదులుకుంటున్నట్టు అండర్‌టేకింగ్‌ ఇవ్వాల్సి ఉంటుంది. ఉద్యోగాలు వస్తాయని భావిస్తున్న ఇంజనీరింగ్‌ కోర్సులకే విద్యార్థులు మొగ్గు చూపారు. ముఖ్యంగా కంప్యూటర్‌ సైన్స్‌దాని అనుబంధ కోర్సులనే ఎక్కువగా కోరుకున్నారు. మెకానికల్‌సివిల్‌ వంటి కోర్సుల్లో చేరడానికి ముందుకు రావడం లేదు. అలాగే బిల్డింగ్‌ సర్వీసెస్‌ ఇంజనీరింగ్‌ఫార్మాస్యూటికల్‌ ఇంజనీరింగ్‌టెక్స్‌టైల్‌ టెక్నాలజీమైనింగ్‌ ఇంజనీరింగ్‌ప్లానింగ్‌ వంటి కోర్సుల్లో చేరడానికి విద్యార్థులు పెద్దగా ఆసక్తి చూపడం లేదు. 28 సీట్లు ఉన్న ఇండస్ట్రియల్‌ ప్రొడక్షన్‌ ఇంజనీరింగ్‌, 21 సీట్లు ఉన్న ఎలకా్ట్రనిక్స్‌ అండ్‌ టెలికమ్యూనికే షన్‌ ఇంజనీరింగ్‌ కోర్సుల్లో చేరడానికి ఒక్కరు కూడా ముందుకు రాలేదు. రెండో దశ కౌన్సెలింగ్‌ ఆగస్టు 9 నుంచి నిర్వహించనున్నారు.

Leave A Reply

Your email address will not be published.