పత్రికలు, ప్రకటనలకే పరిమితం అవుతున్నా పర్యావరణ సమస్యలు

       ప్రపంచ పర్యావరణ సంస్థ అధ్యక్షులు డా.సిహెచ్.భద్ర

తెలంగాణ జ్యోతి వెబ్ న్యూస్:  నేడు ప్రపంచ మానవాళి ఎదుర్కొంటున్న పర్యావరణ సమస్యలపై ప్రపంచ పర్యావరణ సంస్థ ప్రజలకు అవగాహన కల్పించి, చైతన్య పరిచేందుకు కృషి చేస్తుందని ప్రపంచ పర్యావరణ సంస్థ అధ్యక్షులు డా.సిహెచ్.భద్ర అన్నారు.  సంస్థ ఆధ్వర్యంలో లీడ్ ఫౌండేషన్ గ్లోబల్ యూఎస్ఎ చైర్మన్, ప్రపంచ పర్యావరణ సంస్థ చీఫ్ అడ్వైజర్ డా.హరి ఇప్పనపల్లి  సూచనల మేరకు ఇటీవల దుబాయ్ లో ప్రీమియర్ ఇన్ దుబాయ్ ఇన్వెస్ట్మెంట్ పార్క్ హోటల్లో ప్రపంచ పర్యావరణ సంస్థ కార్యవర్గ సమావేశం ఏర్పాటు చేసి భవిష్యత్తు కార్యాచరణ రూపొందించా మని ఈ మేరకు ఒక  ప్రకటనలో ఆయన తెలిపారు. అభివృద్ధి చెందిన, చెందని, చెందుతున్న దేశాల మధ్య పర్యావరణ కాలుష్యం చాలా వ్యత్యాసం ఉందన్నారు. రోజు రోజుకీ పెరిగిపోతున్న గ్లోబల్ వార్మింగ్ క్లోరో, ఫ్లోరా, కార్భన్స్ ఎమిషన్స్ పై అన్ని దేశాలు కేవలం పత్రికలు, ప్రకటనలకే పరిమితం అవుతున్నాయని, అందుకోసం దుబాయ్ లోని వివిధ సంఘాల ప్రతినిధులతో చర్చలు జరిపి భవిష్యత్తులో కనీసం 100 పై చిలుకు దేశాలలో పర్యటించి ఆ దేశాలలోని పర్యవరణ సమస్యలను, అధ్యయనం చేసి, ఆ దేశ అధినేతలు, ప్రభుత్వాలతో చర్చలు జరిపి ప్రజల సంక్షేమం,ఆరోగ్యం, పర్యావరణ పరిరక్షణ కోసం నిరంతరం ప్రపంచ పర్యావరణ పరిరక్షణ సంస్థ పనిచేస్తుందని ఆయన వెల్లడించారు. అనంతరం సంస్థ ప్రధాన కార్యదర్శి నికెల్, ఉపాధ్యక్షులు, ప్రశాంత్, సహాయ కార్యదర్శి రాజేష్ గౌడ్, జాయింట్ సెక్రటరీ చందు, డిజిటల్ మీడియా ఇంచార్జ్ కలారాజ్, టాక్స్ ఫిల్లింగ్ ఇండియా సీఈఓ శ్రీనివాస్, భారత ప్రభుత్వ ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా బోర్డ్ నెంబర్ రెజ్వాన్ అహ్మద్, రచ్చ రాము, తదితరులు పాల్గొని భవిష్యత్తు కార్యాచరణ రూపొందిచడం జరిగిందని చెప్పారు.

Leave A Reply

Your email address will not be published.