23న విద్యార్థులకు వ్యాసరచన పోటీలు

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: ఈనెల 23న ఏఎస్ఆర్ ఫౌండేషన్ వ్యవస్థాపక దినోత్సవం సందర్బంగా విద్యార్థులకు వ్యాసరచన పోటీలు నిర్వహించనున్నట్లు ఫౌండేషన్ వ్యవస్థాపకులు డాక్టర్ అయ్యల సంతోష్ వెల్లడించారు. ఈ సందర్బంగా ఆదివారం ఫౌండేషన్ సబ్యులతో స్తానిక రోడ్లు భవనలశాఖ అథితి గృహంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా అయ్యల సంతోష్ మాట్లాడుతూ ఏఎస్ఆర్ ఫౌండేషన్ వార్షికోత్సవం సందర్భంగా తెలంగాణ ప్రభుత్వ పరిధిలో ఉన్న ప్రభుత్వ ఉన్నత పాఠశాలలు,గురుకుల పాఠశాలలు, ఆదర్శ పాఠశాలలు, కస్తూర్బా పాఠశాలలో 9,10 వ తరగతి చదువున్న , జుక్కల్,బాన్సువాడ నియోజకవర్గ పరిధిలోని విద్యార్థులకు మాత్రమే ఈనెల 23 తేదీన పోటీలు వ్యాస రచన,ఉపన్యాసా పోటీలు నిర్వహించి రెండు విభాగాలకు ప్రథమ ,ద్వితీయ ,తృతీయ బహుమతులు ప్రశంస పత్రం మరియు నగదు బహుమతులు అందచేయబడును.ప్రస్తుతo అన్ని రంగాలలో ఆంగ్లం మరియు కోడింగ్ యొక్క ప్రాధాన్యత ఉన్నందున, పోటీలో పాల్గొన్న విద్యార్థులందరికి ఉచితంగా కోడింగ్ నందు శిక్షణ,స్పోకెన్ ఇంగ్లీష్ మరియు కెరీర్ గైడైన్స్ ఇవ్వడం జరుగుతుంది.రిజిస్ట్రేషన్ చేసుకున్న విద్యార్థులు మాత్రమే పోటీలో పాల్గొనుటకు అర్హులు అని మరిన్ని వివరాల కోసం సెల్: 7386965601 నెంబర్ కు సంప్రదించాలని అన్నారు. ఇది బయట నేర్చుకోవాలంటే ఎంతో ఖర్చుతో కూడుకున్నది.కావున ప్రభుత్వ పరిదిలో ఉన్న పాఠశాలల విద్యార్థులు ఉపయోగిచుకోవాలని,ఉపాద్యాయులు తమ తమ పాఠశాలలో చదివే విద్యార్థులకు ఈ అవకాశాలు కల్పిచే దిశగా విద్యార్థులను ప్రోత్సహించాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు గుడ్ల లక్ష్మణ్,ప్రధాన కార్యదర్శి ఉళ్లేంగల సాయిలు,ఉపాధ్యక్షుడు పోతురాజు రాజు,కందేవార్ శ్రీకాంత్, షిండే వార్ మారుతి,సీనియర్ నాయకులు రొటే సాయిలు,అనిల్,పాండు రంగ్,బాలరాజ్, గైని సంతోష్ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.