రైతులను ఆదుకునేందుకు ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటు

.. సొసైటీ చైర్మన్ కొప్పుల గంగారం యాదవ్

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్/నసురుల్లాబాద్ ప్రతినిధి:  ఆదుకునేందుకు ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాలను  ఏర్పాటు చేస్తుందని నసురుల్లాబాద్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఛైర్మెన్ కొప్పుల గంగారాం యాదవ్ అన్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. శుక్రవారం మండల పరిధిలోని నసురుల్లాబాద్, బొమ్మన్ దేవ్ పల్లి, హాజీపూర్ గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ. సీఎం కేసీఆర్‌ రైతుల సంక్షేమం కోసం ఎంతగానో కృషి చేస్తున్నారని అన్నారు, కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. రైతులు పండించిన చివరి గింజ వరకూ ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని, కొనుగోలు కేంద్రాల ద్వారా రైతులు మద్దతు ధర పొందాలని అన్నారు, శుక్రవారం రోజున సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు, రైతులు పండించిన ధాన్యం కొనుగోలు చేసేందుకు గానూ సొసైటీ ఆధ్వర్యంలో నసురుల్లాబాద్, బొమ్మన్ దేవ్ పల్లి, హాజీపూర్ గ్రామాలలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రభుత్వం ఏర్పాటు చేసిందన్నారు,ఈ కేంద్రాల ద్వారా రైతులు పండించిన ధాన్యాన్ని క్వింటాల్‌కు రూ. ఏ గ్రేట్ 2060, బి గ్రేడ్2040, రకం చొప్పున మద్దతు ధర నిర్ణయించిందన్నారు, రైతులంతా దళారులను ఆశ్రయించకుండా కొనుగోలు కేంద్రాలకు వెళ్లి ధాన్యాన్ని విక్రయించుకోవాలని కోరారు, అలాగే తేమ 17% మించకుండా, చిన్న పట్టి తాలు, పొట్టు లేకుండా ఆరబెట్టిన వరి ధాన్యానికి ఏ గ్రేట్ మరి ధాన్యానికి రూ.2060, బి గ్రేడ్ ధాన్యానికి రూ.2040 ధర రాష్ట్ర ప్రభుత్వం చెల్లిస్తుందన్నారు, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి కేసీఆర్ రైతాంగానికి పెద్దపీట వేస్తూ రైతులకు రైతుబంధు, రైతు బీమా, పంట సాగుకు 24 గంటలు నాణ్యమైన ఉచిత విద్యుత్తును అందజేస్తూ రైతంగానికి ప్రాధాన్యత ఇస్తున్నారని ఆయన పేర్కొన్నారు, కార్యక్రమంలో పాల్గొన్నారు. సొసైటీ చైర్మన్ కొప్పుల గంగారం యాదవ్, వైస్ చైర్మన్ చుంచు లత, డైరెక్టర్ లచ్చవ్వ, హాజీపూర్ గ్రామ సర్పంచ్ అరిగే చిన్న అంజయ్య, జడ్పీటీసీ సభ్యురాలు జన్నుబాయి- ప్రతాప్ సింగ్, నసురుల్లాబాద్ సర్పంచ్ అరిగే సాయిలు, బొమ్మన్ దేవ్ పల్లి గ్రామ సర్పంచ్ అన్నం సత్యనారాయణ, ఎంపీటీసీ మామిళ్ళ నారాయణరెడ్డి, తాహసిల్దార్ బావయ్య, ఎన్ డి సీసీ బ్యాంక్ డిజిఎం భాస్కర్ రెడ్డి, సొసైటీ డైరెక్టర్స్ కిషన్ గౌడ్, తన బుద్ధి లక్ష్మణ్, వడ్డే నారాయణ, డి. లక్ష్మణ్, ఎ. రాజిరెడ్డి, తెరాస సీనియర్ నాయకులు వంగ లక్ష్మీనారాయణ గౌడ్, చుంచు నారాయణ, మాజీ జెడ్పీటీసీ కిషన్ నాయక్, మాజీ ఎంపీటీసీ కిష్టా గౌడ్, సీఈఓ శ్రీనివాస్, సంగయ్య, తెరాస పార్టీ నాయకులు, కార్యకర్తలు, పార్టీ శ్రేణులు, రైతులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.