ఆర్టీసీ విలీనంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన ఈటెల

తెలంగాణ జ్యోతి/ వెబ్ న్యూస్: తెలంగాణలో ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం బిల్లు అంశం హాట్ టాపిక్‌గా మారింది. కాగా.. ఈ విషయంపై బీజేపీ నేత ఈటల రాజేందర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆర్టీసీ విలీనం బిల్లు విషయంలో గవర్నర్‌పై బట్టకాల్చి మీద వేసే ప్రయత్నం చేస్తున్నారని ప్రభుత్వంపై మండిపడ్డారు. గవర్నర్‌కు ఒక్క రోజు ముందే బిల్లు పంపారని తెలిసిన ఈటల రాజేందర్.. ఆ బిల్లును చూడాలి, చదవాలి, సంతకం చేయాలని వివరించారు. అందుకు కొంత సమయం తీసుకుంటే తప్పేంటని చెప్పుకొచ్చారు. అందులోనూ.. గవర్నర్ అందుబాటులో లేరు అని చెబుతున్నా ప్రభుత్వం హడావుడి చేయటం విడ్డూరంగా ఉందన్నారు ఈటల రాజేందర్.ఆర్టీసీలో సంస్థకు సంబంధించి 6 వేల బస్సులు మాత్రమే నడుస్తున్నాయని ఈటల రాజేందర్ చెప్పుకొచ్చారు. ఆర్టీసిని ప్రభుత్వంలో విలీనాన్ని స్వాగతిస్తున్నామన్నారు. అయితే.. ఇప్పటికే ఆర్టీసి కార్మికులకు రెండు పీఆర్సీలను ప్రభుతం బకాయిలు పడిందన్నారు. ఆర్టీసిలో పనిచేసే ఇతర సిబ్బందిని కూడా పర్మినెంట్ చేయాలని డిమాండ్ చేశారు. మరోవైపు.. ఆర్టీసీ కార్మికులను బలవంతంగా గవర్నర్ కార్యాలయం ముందు ధర్నాకు తీసుకువస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వాన్ని ఆర్టీసి కార్మికులు నమ్మే పరిస్థితి లేదన్నారు ఈటల రాజేందర్. వచ్చే ప్రభుత్వంలో ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కారం అవుతాయని చెప్పుకొచ్చారు.గెస్ట్ లెక్చరర్స్, సెకండ్ ఏఎన్ఎంలు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు, మహిళా సంఘాలు అనేక మంది తమ సమస్యలు చెప్పుకుందామంటే ఎవరు పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు ఈటల రాజేందర్. మంత్రులు, అధికారులు భరోసా ఇవ్వడం లేదన్నారు. సీఎం కేసీఆర్ ఎవరికి అందుబాటులో ఉండరన్నారు. సమస్యలపై చర్చించడానికి అసెంబ్లీ నిర్వహించాలి కానీ.. వాటిని మొక్కుబడిగా నిర్వహిస్తున్నారన్నారు. ఒక రోజు హరీష్ రావు, ఇంకో రోజు కేటీఆర్ దాడి చేశారని.. ఇక రేపు కేసీఆర్ వచ్చి ఆయన కూడా దాడి చేస్తారని ఈట రాజేందర్ విమర్శించారు

Leave A Reply

Your email address will not be published.