ప్రతి ఒక్కరూ అవయవదానానికి ముందుకురావాలి

-  వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: ప్రతి ఒక్కరూ అవయవదానానికి ముందుకురావాలనిదాంతో మరొకరికి పునర్జన్మను ప్రసాదించినట్లవుతుందని వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు. 13వ జాతీయ అవయవదాన దినోత్సవం సందర్భంగా జీవన్ దాన్ ఆధ్వర్యంలో రవీంద్ర భారతిలో అవయవ దానం చేసిన కుటుంబాలను మంత్రులు మహమూద్‌ అలీశ్రీనివాస్ యాదవ్ఎమ్మెల్యే దానం నాగేందర్ఎమ్మెల్సీ వాణీదేవిఎమ్మెల్సీ ప్రభాకర్టీఎస్ఎంఎస్ఐడీసీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్‌తో కలిసి సన్మానించారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ అత్యధిక అవయవ దానాలు జరిగిన రాష్ట్రంగా తెలంగాణ సాధించిన ఘ‌న‌త‌ను కేంద్ర ప్రభుత్వం గుర్తించిందన్నారు. నేడు ఢిల్లీలో జ‌రిగే జాతీయ అవ‌య‌వ‌దాన కార్యక్రమంలో తెలంగాణ ప్రతినిధులు కేంద్ర ఆరోగ్యమంత్రి చేతుల మీదుగా ప్రథమ బహుమతి అందుకుంటుందన్నారు. ఈ సందర్భంగా అందరికీ అభినందనలు తెలిపారు. కేసీఆర్‌ తీసుకున్న నిర్ణయాలుకల్పించిన మౌలిక సదుపాయాలతోనే ఇది సాధ్యమన్నారు.

Leave A Reply

Your email address will not be published.