పర్యావరణ పరి రక్షనే లక్ష్యంగా ప్రతి ఒక్కరు ముందుకు రావాలి

- చందన బ్రదర్స్ సిల్క్స్ఆద్వర్యం లో ఉచితంగా మట్టి విత్తనపు గణేశ విగ్రహాల పంపిణీ

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: పర్యావరణ పరి రక్షయే లక్ష్యంగా సంగారెడ్డి లో 20000 మట్టి విత్తనపు గణేశ విగ్రహాలను చందన బ్రదర్స్ సిల్క్స్ఆద్వర్యం లో ఉచితంగా పంపిణీ చేసారు. ఈ సందర్బంగా చందన బ్రదర్స్ సిల్క్స్ సంస్థ యజమాని సురేష్ మాట్లాడుతూ”పర్యావరణ పరి రక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత. ప్రస్తుత తరం ఆనందంగా జీవించాలన్నా,  భావి తరానికి ఆహ్లాద కరమైన భవిష్యత్ ను అందించాలన్నా పర్యావరణం కాపాడుకోవాల్సి ఉంటుంది. ఈ పర్యావరణం పట్ల ప్రతి ఒక్కరూ ప్రేమను కనబరచ వలసినదే ! నన్నారు. మానవునికి, ప్రకృతికి వున్న బంధాన్ని చెప్పటమే కాదు అన్ని ప్రాణులనూ అక్కున చేర్చుకోవాలనే మహోన్నత సందేశాన్ని మన పండుగలు అందిస్తుంటాయి. అలాంటి పండుగల్లో మొదటగా వచ్చేది… వినాయక చవితి. ప్రకృతి తో మమేకం కావాల్సిన అవసరం మాత్రమే కాదు, ఆ ప్రకృతి చేసే మేలు కూడా ఈ పండుగ రూపేణా తెలుసుకునే వీలు కలుగుతుందన్నారు. ఈ పండుగ స్ఫూర్తిని వెల్లడిస్తూనే, నీటి వనరులను కాపాడుకోవాల్సిన ఆవశ్యకత తెలుపుతూ మట్టి విత్తనపు విగ్రహాల పంపిణీకి చందన బ్రదర్స్ సిల్క్స్ సంస్థ శ్రీకారం చుట్టిందన్నారు. సంగారెడ్డి లో కలెక్టరేట్ ఎదురుగా వున్న చందన బ్రదర్స్ సిల్క్స్ షో రూమ్ ( త్వరలో ప్రారంభం కానుంది ) వద్ద నేడు దాదాపు 20000 మట్టి విత్తనపు గణేశ విగ్రహాలను  పూర్తి ఉచితంగా పంపిణి చేసింది. పర్యావరణ అనుకూల ఫ్యాషన్ ప్రప్రపంచాన్ని ఏలుతున్న కాలంలో , ఆ ఫ్యాషన్ లను ఇంటిల్లి పాదికి అందించటం లో ముందున్న చందన బ్రదర్స్ సిల్క్స్ మహోన్నత కార్యక్రమానికి శ్రీకారం చుట్టటం విశేషం.మట్టి విత్తనపు విగ్రహాలను పంపిణి చేసిన పర్యావరణ అనుకూలత అనేది ఇప్పుడు అవకాశం ఎంతమాత్రమూ కాదు. అది ఆవశ్యకత అయింది. మన భావితరాలకు మెరుగైన ప్రకృతి ని అందించాలంటే ఇప్పుడు మనం జాగ్రత్త పడాల్సి ఉంటుంది. చందన బ్రదర్స్ సిల్క్స్ ఆ దిశగా తమ వంతు కార్యక్రమాలను చేస్తుంది. పర్యావరణ అనుకూల ఫ్యాషన్ లు అందించటం మాత్రమే కాకుండా, ప్రజలకు అవగాహన కల్పించే క్రమం లో ఈ విగ్రహాల పంపిణి చేపట్టాము” అని అన్నారు . ఈ క్రమంలోనే పండుగ స్ఫూర్తి ని మరువకుండా వినాయక చవితి ని వేడుక చేసుకోవాల్సిందిగా కోరిన చందన బ్రదర్స్ సిల్క్స్ , వచ్చే నెలలో తమ నూతన స్టోర్ ను సంగారెడ్డిలో ప్రారంభించనున్నట్లు వెల్లడించారు.

Leave A Reply

Your email address will not be published.