ఈవీఎం మిషన్లను,సీసీ కెమెరా, సాటిలైట్ న్యూస్ ఛానల్ పర్యవేక్షణలోఉంచాలి

తెలంగాణ జ్యోతి/ వెబ్ న్యూస్: రాష్ట్రము లో ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని ఈవీఎం మిషన్లను,సీసీ కెమెరా, సాటిలైట్ న్యూస్ ఛానల్ పర్యవేక్షణలోఉంచాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి కోవూరి సత్యనారాయణ గౌడ్ డిమాండ్ చేసారు. హైదరాబాద్ లో ఏర్పాటుచేసిన మీడియా సమావేశం లో ఆయన మాట్లాడుతూ ప్రస్తుత తరుణంలో సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి నవంబర్ 30న జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రవ్యాప్తంగా ఈవీఎం మిషన్లకు సీసీ కెమెరాలను మరియు సాటిలైట్ న్యూస్ ఛానల్ ల పర్యవేక్షణలో 24/7, ఉండేలా డిసెంబర్ 3 ఫలితాలను వెళ్లడి చేసే వరకు ఉంచాలని కోరారు. అప్పుడు ఈవీఎం మిషన్ల లో ఎటువంటి అవకతవకలు జరగకుండా ప్రతి ఒక్క ఓటరు ఇంటి వద్ద నుండే పర్యవేక్షణలో ఉన్న ఈవీఎం మెషిన్లను అబ్జర్వేషన్ చేస్తూ ఉంటాడని తద్వారా ప్రజలు కోరుకునే ప్రభుత్వాలు ఏర్పడుతాయని అదేవిధంగా ఎటువంటి అపోహలు ప్రజల్లో మరియు నాయకుల్లో ఉండవని అన్నారు. రాష్ట్ర ఎన్నికల కమిషన్ కు మరియు భారత ఎన్నికల కమిషన్ కు తేదీ అక్టోబర్ 9 రోజున ఈవీఎం మెషిన్ కు బయోమెట్రిక్ మిషన్ ను మరియు ఆధార్ లింక్ అనుసంధానం చేయాలని విజ్ఞప్తి పత్రం అందజేసిన విషయాని ఈ సందర్బంగా గుర్తు చేసారు. కావున ఇట్టి విషయాన్ని ప్రతి ఒక్క రాజకీయ పార్టీ అధినేతలు ఎన్నికల కమిషన్ను మరియు ఎన్నికల అధికారులను ఆశ్రయించి ఈవీఎం మెషిన్ల పట్ల భద్రత కల్పించాలని సీసీ కెమెరా, మరియు సాటిలైట్ న్యూస్ ఛానల్ ల పర్యవేక్షణలో ఉండే విధంగా చూడాలని విజ్ఞప్తి చేసారు.

Leave A Reply

Your email address will not be published.