మాజీ సైనికులకు ఇండ్ల స్థలాలు ఇప్పించి ఆదుకోవాలి

తెలంగాణ జ్యోతి/ వెబ్ న్యూస్: దేశ భద్రతలో కీలక భూమిక పోషించి పదవి విరమణ పొందిన సైనికులకు ఇండ్ల స్థలాలు ఇప్పించి ఆదుకోవాలని తెలంగాణ రాష్ట్ర మాజీ సైనికుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు అమ్మిక రంగయ్య గౌడ్ రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు శనివారం  హైదర్ గూడ ఎన్ఎస్ఎస్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాజీ సైనికుల కుటుంబ సభ్యులతో కలసి ఆయన మాట్లాడుతూ హైదరాబాద్ శివారు జవహర్ లాల్ నగర్ లో మాజీ సైనికులకు కేటాయించిన నిరుపయోగంగా ఉన్న 5977ఎకరాల 3 గంటల మాజీ సైనికుల ఫైరింగ్ రేంజ్ భూమిని 35 వేల మంది సైనిక కుటుంబాలకు 250 గజాల చొప్పున ఇవ్వాలని కోరారు. 20 ఏళ్లుగా పోరాటం చేస్తున్న పాలకులు పట్టించుకున్న పాపన పోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇట్టి విషయం లో హైకోర్ట్ కుడా స్పష్టమైన తీర్పునిస్తూ మాజీ సైనికులకు ఇంటి స్థలం ఇవ్వాలని సూచింన్చిందని తెలిపారు. అనేక మంది ఆర్థిక పరిస్థితులు బాగాలేక ఎన్నో ఇబ్బందులు పడుతున్నారనికొంతమంది మృతి చెందారని తెలిపారు. దేశ సరిహద్దుల్లో ప్రాణాలు తెగించి విధులు నిర్వహించిన తమపై సిఎం కేసీఆర్మంత్రి కేటీఆర్ దృష్టి సారించి ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న సొంతింటి కల నెరవేర్చి తమ జీవితాల్లో వెలుగు నింపాలని కోరారు. ప్రభుత్వం స్పందించని పక్షంలో అతి త్వరలో మాజీ సైనిక కుటుంబాలతో నిరాహార దీక్షకు సిద్ధమవుతామని హెచ్చరించారు. ఈ సమావేశంలో ఎండి.నూర్ ఖాన్కసిరెడ్డితహెరున్నిసా బేగంవర్ధినికామరున్నిసామార్గరేట్ పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.