పోలీస్‌ కొలువుకు కసరత్తు

.. షాద్ నగర్ లో సైనిక్ డిఫెన్స్ అకాడమీ ఆధ్వర్యంలో అభ్యర్థులకు శిక్షణ - దేహా దారుఢ్య పరీక్షలకు సిద్ధంగా అభ్యర్థులు - ఉచిత శిక్షణకు చేయూత అందిస్తున్న "కోచ్ నరేందర్" - ఇండోర్ స్టేడియంలో అభ్యర్థుల కోలహలం

తెలంగాణజ్యోతి/వెబ్ న్యూస్: సిటీటైమ్స్: పోలీసు ఉద్యోగాలు సాధించాలనే లక్ష్యంతో యువతీ యువకులు కుస్తీ పడుతున్నారు. ఈవెంట్స్‌లో పట్టుసాధించడానికి నిరంతరం శ్రమిస్తున్నారు. రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పట్టణంలో సైనిక్ డిఫెన్స్ అకాడమీ నిర్వాహకులు నరేందర్ ద్వారా ఉచిత శిక్షణ పొంది ప్రిలిమినరీ రాత పరీక్షల్లో అర్హత సాధించిన అభ్యర్థులు ఇప్పుడు ఫిజికల్‌ ఈవెంట్స్‌ కోసం కసరత్తు ప్రారంభించారు. నిష్ణాతులైన కోచ్‌ల ద్వారా శిక్షణ పొందుతున్నారు. సైనిక్ డిఫెన్స్ అకాడమీ ద్వారా ఉచిత శిక్షణను అందిస్తున్నారు. ఏడాదిపాటు ఎంతో కష్టపడి ప్రిలిమినరీ పరీక్షలో అర్హత సాధించిన యువతీ, యువకులు కఠోర సాధనకు సిద్ధపడ్డారు. సౌకర్యాలు లేకపోయినా గ్రామీణ ప్రాంతాల్లో యువకులు ఉదయం, సాయంత్రం వేళల్లో కసరత్తు చేస్తున్నారు. వీరికి కొన్ని సంస్థలు చేయూతను అందిస్తున్నాయి. ఈ నేపథ్యంలో సైనిక్ డిఫెన్స్ అకాడమీ నిర్వాహకుడు నరేందర్ తనదైన శైలిలో షాద్ నగర్ ఇండోర్ స్టేడియంలో యువతీ యువకులకు కఠోర దీక్షలు అందిస్తున్నారు. దాదాపు 50 మంది యువతీ యువకులు ఆయన వద్ద ప్రత్యేక శిక్షణను తీసుకుంటున్నారు. ఇందులో కొందరు కానిస్టేబుల్స్ సైతం ఎస్సై పరీక్షలకు సైతం ఆయన వద్ద కోచింగ్ తీసుకుంటున్నారు. సైనిక్ డిఫెన్స్ అకాడమీ ద్వారా 2016 నుండి ఆయన శిక్షణ ఇస్తున్నారు. ఇప్పటివరకు 250 మందికి ఆయన శిక్షణ ఇచ్చారు. ఇందులో 160 మంది ప్రగతి సాధించినట్లు నరేందర్ షాద్ నగర్ సిటీటైమ్స్ ప్రతినిధికి తెలిపారు.

– ఈవెంట్స్‌తోనే కొలువు

పోలీస్‌ కొలువు సాధించాలంటే పోలీస్ శాఖ నిర్వహించే ఫిజికల్‌ ఈవెంట్స్‌ సాధించాల్సి ఉంటుంది. ఈసారి ఈవెంట్స్‌లోనూ స్వల్ప మార్పులు తీసుకొచ్చారు. పురుషులకు 1600 మీటర్లు, మహిళలకు 800 మీటర్ల రన్నింగ్‌, లాంగ్‌జంప్‌, షాట్‌పుట్‌ మాత్రమే నిర్వహించనున్నారు. గతంలో ఉండే పలు ఈవెంట్స్‌ను తొలగించారు. ప్రధానంగా రన్నింగ్‌ ఈవెంట్‌లో రాణించడానికి యువతీ యువకులు ఉదయం, సాయంత్రం వేళల్లో సాధన చేస్తున్నారు. షాద్ నగర్ సైనిక్ డిఫెన్స్ అకాడమీ ఆధ్వర్యలో వాకింగ్‌, రన్నింగ్‌ చేయిస్తూ. గతంలో లేనంతంగా యువకులు ఈసారి పోలీస్‌ కానిస్టేబుల్‌ ప్రిలిమినరీ పరీక్షకు వేలాది మంది అభ్యర్థులకు అదే స్థాయిలో హాజరు కాగా 31.39 శాతం అర్హత సాధించారు. ఎస్సై ప్రిలిమినరీ పరీక్షకు వేలాది మంది అభ్యర్థులకు అదే స్థాయిలో హాజరు కాగా 46.80 శాతం ఉత్తీర్ణత సాధించారు. ఉత్తీర్ణత సాధించిన వారు ఈవెంట్స్‌లోనూ ముందంజలో నిలవడానికి కృషి చేస్తున్నారు.
ఆర్మీ రిక్రూట్మెంట్ కు సంబంధించి కూడా నరేందర్ శిక్షణ ఇస్తున్నారు.

– శాయశక్తుల ప్రయత్నిస్తున్నాం – సైనిక్ డిఫెన్స్ అకాడమీ నిర్వాహకుడు నరేందర్

యువతి యువకులు రాటుదేలే విధంగా తన శక్తి వంచన లేకుండా దేహదారుడ్య పరీక్షలకు సిద్ధం చేస్తున్నామని సైనిక్ డిఫెన్స్ అకాడమీ నిర్వాహకుడు నరేందర్ తెలిపారు. కఠోర దీక్షతో మంచు కొరికే చలిలో ఉదయం 5 గంటల నుండి అభ్యర్థులు కఠోర శ్రమ ద్వారా ఫలితాన్ని రాబట్టేందుకు కృషి చేస్తున్నామని అన్నారు. ఇప్పటివరకు 250 మందికి తాను ఫిజికల్ ఫిట్నెస్ తోపాటు దేహదారుడ్య పరీక్షలకు సిద్ధం చేశామని తెలిపారు. ఇందులో 160 మంది వరకు ఉత్తీర్ణులు అయ్యారని, ఈ ఏడాది 50 మందికి శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు. రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ నియోజకవర్గం లోని ఆయా గ్రామాలకు చెందిన యువతీ యువకులు తర్వాత శిక్షణ పొందుతున్నట్లు తెలిపారు. అదే విధంగా ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన మరికొందరు కూడా ఇక్కడే శిక్షణ తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. కొంతమంది తమ ఇంటి నుండి కోచింగ్ కోసం రాగా మరికొంత మంది మాత్రం ఇక్కడ హాస్టల్ సౌకర్యంతో ఉంటున్నారని పేర్కొన్నారు. శక్తి వచన లేకుండా కసి పట్టుదలతో ప్రయత్నిస్తే సాధ్యం కానిదంటూ ఏదీ లేదని అభ్యర్థులకు తన వంతు ప్రోత్సాహాన్ని సహకారాన్ని అందజేస్తున్నట్లు తెలిపారు. శిక్షణ కోసం నరేందర్ ఫోన్ నంబర్ +91 99124 70464 సంప్రదించగలరు.

Leave A Reply

Your email address will not be published.