తెలంగాణలో ల్యాండ్ సర్వే పై విస్తృత కథనాలు

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: తెలంగాణ సర్కార్ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న భూముల వివరాలను తెప్పించుకుంటుంది. గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో ఏ రకమైన భూములు ఉన్నాయి? ఎవరిపేరు మీద ఎంత భూమి ఉంది? అని తెలుసుకొనబోతుంది. ల్యాండ్ కు సంబంధించిన వివరాలు ప్రభుత్వం దగ్గర ఉన్నప్పటికీ నియోజకవర్గాల వారీగా ఎంత భూమి ఉంది? అని లెక్కలు వేయనుంది. ఇందుకోసం ఒక ఫార్మాట్ ను రూపొందించి దాని ప్రకారంగా వివరాలు సేకరించాలని అధికారులను ఆదేశించారు. తాజాగా సీఎస్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఈ వివరాలు సేకరించాలని తెలిపారు. అయితే ప్రభుత్వం భూ వివరాలు సేకరించడంపై అనేక కథనాలు వెలువడుతున్నాయి. ప్రభుత్వం ఏదైనా కొత్త స్కీం ప్రవేశపెడుతుందా? లేక ఉన్న పథకాలను అమలు చేయడానికి వివరాలు తెప్పించుకుంటుందా? అనే చర్చ సాగుతోంది.మరి కొద్ది నెలల్లోనే అసెంబ్లీ ఎన్నికలు ఉండనుండంతో ప్రభుత్వం కొన్ని కార్యక్రమాలను స్పీడప్ చేస్తోంది. ముందస్తు ఊహాగానాలు జోరుగా వినిపించడంతో ఆ పరిస్థితి రాకముందే కొన్ని పథకాలను ఇంప్లిమెంట్ చేయనున్నారు.ఇటీవల నిర్వహించిన అసెంబ్లీలో పలు పథకాల గురించి కేసీఆర్ వివరించారు. ముఖ్యంగా సొంతంగా జాగా ఉన్నవాళ్లకు రూ.3 లక్షల ఆర్థిక సాయం అందిస్తామని ఆర్థిక మంత్రి హరీశ్ రావు బడ్జెట్ లో పొందుపరిచారు. దీంతో ఆ పథకం కోసమే భూముల వివరాలు సేకరిస్తున్నారా? అని అనుకుంటున్నారు.ఇది కాకపోతే ఎవరి పేరిట ఎంత జాగా ఉందో సేకరించిన సొంత జాగా ఉన్న వాళ్లకు రూ.3 లక్షలు సాయం చేసి.. పూర్తిగా జాగ లేని పేదవాళ్ల కోసం ఏదైనా కొత్త పథకాన్ని తీసుకొస్తారా? అనేది తెలియాల్సి ఉంది. ఎన్నికల హడావుడి నేపథ్యంలో ప్రభుత్వం హడావుడిగా భూ వివరాలు సేకరించడంపై పథకంలో అర్హులను ఎంపిక చేయాలనే ఉద్దేశమే అని వినిపిస్తోంది.గతంలో దళితులకు మూడెకరాలా భూమి ఇస్తామని చెప్పారు. ఆ తరువాత అది ఫెయిల్ అయింది. అయితే వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి రావడానికి దీనిని మళ్లీ తెరపైకి తెస్తారా? అని అనుకుంటున్నారు.గతంలో కేసీఆర్ దేశ రైతులను అబ్బురపరిచే పథకాన్ని అందుబాటులోకి తీసుకొస్తానని ప్రకటించారు. ఆసరా పింఛన్ లాగే రైతులకు పింఛన్ ఇచ్చే ఉద్దేశంతోనే కేసీఆర్ అన్నీ సిద్ధం చేస్తున్నారన్న వాయిస్ వినిపిస్తోంది.ఈ స్కీం కోసం అర్హులకు ఎంపిక చేసేందుకు భూ వివరాలు తెప్పించుకుంటున్నారని తెలుస్తోంది. ఒక్కో రైతుకు ఎంత భూమి ఉంది? ఎంత పింఛన్ ఇవ్వాలి? అనే విషయంపై చర్చించే అవకాశం ఉందని అంటున్నారు. ఏదీఏమైనా భూ వివరాలపై అధికారికంగా ప్రకటన వెలువడే వరకు కాస్త ఉత్కంఠగానే ఉందిన రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

Leave A Reply

Your email address will not be published.