రాష్ట్రంలో వేగంగా వ్యాప్తి చెందుతున్న కళ్ళకలక వైరస్

- కళ్ళకు సోకిన వారి కళ్ళలోకి చూస్తే కలక వైరస్ వ్యాపించాదు - తరచూ చేతులు కడుక్కోవాలి ..అశ్రద్ధ చేస్తే రెటీనా పై ప్రభావం  - ప్రభుత్వ నర్సింగ్ కళాశాల ప్రిన్సిపల్ లిల్లీ మేరి

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: 20 రోజుల క్రితం వరకు ఎండలు బాగా కాసాయి. ఆ తర్వాత ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. గత 20 రోజుల నుంచి భారీ వర్షాలు కురుస్తూ ఉండటం వలన వాతావరణ మార్పుల కారణంగా,  గాలిలో బ్యాక్టీరియా వైరస్ క్రిములు విపరీతంగా పెరిగాయని సిద్దిపేట ప్రభుత్వ నర్సింగ్ కళాశాల ప్రిన్సిపల్ లిల్లీ మేరి చెబుతున్నారు.  అలా పెరిగి అతి సున్నితమైన కళ్ళపై ప్రభావం చూపుతున్నాయని ఆమె అన్నారు. ఈ వైరస్ బ్యాక్టీరియా కారణంగానే కళ్ళకలక సమస్య తెలుపుతుందని,  వానాకాలంలో ఇది ఎక్కువగా ఇబ్బంది పెడుతుందని కళ్ళ కలక వస్తే కన్ను ఎర్రగా మారుతుందని, కళ్ళ నుంచి నీరు కారుతుందని, అలాగే కంటి రెప్పలు వాస్తాయని, నిద్రపోయి లేచినప్పుడు కళ్ళ రెప్పలు అతుక్కుపోతాయని, అలాగే కంటినొప్పి ఉంటుందని, కొన్నిసార్లు తీవ్ర దురద కూడా ఉంటుందని, వైరస్ వల్ల వస్తే సుమారు మూడు వారాలపాటు ఉంటుందని లిల్లీ మేరి అన్నారు.  అదే బ్యాక్టీరియా వల్ల అయితే వారం పది రోజుల పాటు ఉంటుందన్నారు.  కళ్ళకు సోకిన వారి కళ్ళలోకి చూస్తే కలక వైరస్ వ్యాపిస్తుందనడం పూర్తిగా అవాస్తవమని,  కళ్ళకలకు సోకిన వారు ఉపయోగించిన వస్తువులు వాడి ఆ చేతులను కళ్ళకు తాకించినప్పుడు మాత్రమే వైరస్ వ్యాప్తి చెందుతుందని లిల్లీ మేరి అన్నారు.  రాష్ట్రంలో వేగంగా వ్యాప్తి చెందుతున్న కళ్ళకలక వైరస్ గురుకులాలు, సంక్షేమ హాస్టల్లో కలవరి పెడుతుందని వందల సంఖ్యలో విద్యార్థులు ఒకే చోట ఉండటంతో ఒకరి నుంచి మరొకరికి వేగంగా వ్యాప్తి చెందుతుందని,  వైరస్ అధికంగా సోకిన విద్యార్థులను ఐసోలేషన్ లో ఉంచుతుండగా, కొంత మందిని ఇళ్లకు పంపుతున్నారని లిల్లీ మేరి అన్నారు.తరచూ చేతులు శుభ్రం చేసుకోవాలి అని లిల్లీ మేరి తెలిపారు.

 కళ్ళ కలకతో జాగ్రత్తగా ఉండాలి.  కళ్ళు ముట్టుకోవద్దు.  తరచుగా సబ్బుతో చేతులు కడుక్కోవాలి.  దాంతో ఈ వ్యాధివ్యాప్తిని అరికట్టవచ్చు.  అలాగే కళ్లద్దాలు వాడటం ద్వారా ఇతరులకు వ్యాధి వ్యాపించకుండా అరికట్టవచ్చు.  అశ్రద్ధ చేస్తే రెటీనా పై ప్రభావం పడుతుంది.  కళ్ళు ఎర్రబడటం,  నీరు కారటం,  పుసి కట్టడం వంటి లక్షణాలు కనిపించిన వెంటనే డాక్టర్ ను సంప్రదించాలి అని సిద్దిపేట ప్రభుత్వ నర్సింగ్ కళాశాల ప్రిన్సిపల్ లిల్లీ మేరి చెబుతున్నారు.

Leave A Reply

Your email address will not be published.