కామారెడ్డిలో రైతుల ఆందోళన కేసీఆర్ పతనానికి నాంది

- ఎంపీ లక్ష్మణ్

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: కామారెడ్డిలో రైతుల ఆందోళన కేసీఆర్ పతనానికి నాంది అని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ అన్నారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ… రైతులను మంత్రులు ఎగతాళి, వ్యంగ్యంగా మట్లాడటాన్ని బీజేపీ నేత ఖండించారు. దొడ్డి దారిన కాకుండా.. గ్రామసభ నిర్వహించి మాస్టర్ ప్లాన్‌పై నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేశారు. రుణమాఫీ పేరుతో ఓట్లు దండుకున్న కేసీఆర్.. రైతుల ఉసురు పోసుకున్నారన్నారు. రాబోయే మూడు నెలల్లో ప్రజా సమస్యలపై బీజేపీ పోరాటాన్ని ఉధృతం చేస్తోందని తెలిపారు. పల్లె పల్లెకు బీజేపీ పేరుతో రైతు సమస్యలపై పోరాడుతామన్నారు. కేసీఆర్ హటావో తెలంగాణ బచావో నినాదంతో.. మిషన్ 90లక్ష్యంగా ముందుకెళ్తామని చెప్పారు. ఏప్రిల్‌లో కేసీఆర్ ప్రభుత్వంపై అమిత్‌షా ఛార్జ్‌షీట్ విడుదల చేస్తారని తెలిపారు. సంక్రాంతి తర్వాత ప్రజా సమస్యలపై మేధావుల సమ్మేళనం నిర్వహిస్తామన్నారు. తెలంగాణను కాపాడుకోవటం‌ కోసం మేధావులు, కవులు, కళాకారులు స్పందించాలని కోరారు. దళితులకు మూడెకరాల భూమి ఇస్తామన్న కేసీఆర్ ఎందుకివ్వలేదని ప్రశ్నించారు. రైతుబంధు పేరు మీద కేసీఆర్ ప్రభుత్వం బడా బాబులకు కొమ్ము కాస్తోందని ఆరోపించారు. మోదీ నాయకత్వంలోని కేంద్రం మాత్రమే రైతులకు న్యాయం చేస్తోందని లక్ష్మణ్ తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.