ఫీజు రీయింబర్స్ మెంట్ విడుదల చేయాలి

తెలంగాణ జ్యోతి / వెబ్  న్యూస్: ఫీజు రీయింబర్స్ మెంట్ విడుదల చేయాలని ఉమ్మడి నిజామాబాద్ జిల్లాల ఇంచార్జి జైత్రమ్ రాథోడ్, కామారెడ్డి జిల్లా అధ్యక్షులు వినోద్ నాయక్ అన్నారు. గిరిజన విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో గురువారం. విలేకరులతో సమావేశం నిర్వహించి మాట్లాడారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పెండింగ్ లో ఉన్న విద్యార్థుల ఫీజు రీయింబర్స్ మెంట్ లను తెలంగాణ ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని అన్నారు గత రెండు సంవత్సరాల నుండి సుమారు 3350 కోట్ల రూపాయల ఫీజు రీయింబర్స్మెంట్ , స్కాలర్ షిప్ లు విడుదల చేయలేదని ప్రభుత్వం చెల్లించకపోవడంతో వాటిపై ఆధారపడి ఉన్నత చదువులను అభ్యసించే పేద , మధ్యతరగతి విద్యార్థులు చాలా ఇబ్బందులకు గురవుతున్నారన్నారు . ఫీజు మొత్తం చెల్లిస్తేనే సర్టిఎ ” కెట్లు ఇస్తామని కళాశాల యాజమాన్యం చెప్పడంతో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి , ఉద్యోగం చేసి కుటుం బానికి ఆసరాగా నిలుద్దామని అనుకున్న పేద మధ్య తరగతి విద్యా ర్థులకు నిరాశే మిగిలిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఫీజు రీయింబర్స్ మెంట్ ఇవ్వక పోవడం వలన సర్టిఫికెట్లు లేకపోవడంతో తీవ్రమైన మనోవేదనకు గురై విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్న సంఘటనలు చాలా ఉన్నాయన్నారు . ప్రభుత్వం ప్రతీ సంవత్సరం ఫీజు రీయింబర్స్ విడుదల చేయకపోవడంతో చిన్న ప్రయివేట్ ఇంజనీరింగ్ డిగ్రీ కాలేజ్ మూతబడ్డ సంఘటనలు ఉన్నాయని అన్నారు . ఫీజు రీయింబర్మెంట్ సకాలంలో రావడం లేదని తెలిసి కాలేజ్ యాజమాన్యాలు కాలేజ్లో చేరే ముందు మొత్తం ఫీజు చెల్లిస్తేనే అడ్మిషన్లు ఇస్తామని తెలప డంతో చాలా మంది పేద , మధ్యతరగతి విద్యార్థులు డబ్బులు కట్టలేక చదువును మధ్యలోనే వదిలేసి చిన్న ప్రైవేట్ కంపెనీలలో ఉద్యోగం చేయాల్సిన పరిస్థితి ఏర్పదిందన్నారు . ప్రభుత్వం పేద , మధ్యతరగతి విద్యార్థులను చదువుకు దూరం చెయ్యాలనే దురుద్దేశంతో ఫీజు రీయింబర్స్ మెంట్ స్కాలర్ షిప్ లు సకాలంలో చెల్లించడం లేదని అన్నారు . 2022-23 అకాడమిక్ లో ఇంజనీరింగ్ , ఫార్మసీ , డిగ్రీ విద్యార్థులు ఎలాంటి ఇబ్బందులు లేకుం డా ఉన్నత చదువులు చదవాలంటే వెంటనే జాప్యం చెయ్యకుండా ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల చేయా లని డిమాండ్ చేశారు . లేకుంటే విద్యార్థులతో కలిసి రాష్ట్ర వ్యాప్తంగా భారీ ఎత్తున ఉద్యమిస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు . ఈ సమావేశంలో విద్యార్థి నాయకులు సాయి కుమార్ వెంకటేష్, విక్రమ్,నవీస్ తదితరులు పాల్గొన్నారు .

 

Leave A Reply

Your email address will not be published.