మండూస్ తుఫాన్ బాదితులకు రూ.2 వేలు చొప్పున ఆర్థిక సాయం

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్:  మండూస్ తుఫాన్ త‌మిళ‌నాడుతో పాటు ఆంద్ర‌ప్ర‌దేశ్‌లోని కొన్ని జిల్లాల్లో విధ్వంసం సృష్టించిన విష‌యం తెలిసిందే. తాజాగా బంగాళాఖాతంలో అల్ప‌పీడనం బ‌ల‌హీన‌ప‌డ‌డంతో తుఫాన్ తీవ్ర‌త త‌గ్గింది. ఇప్ప‌టికే చాలామందిని పున‌రావాస కేంద్రాల‌కు త‌ర‌లించారు. తుఫాన్ కార‌ణంగా న‌ష్ట‌పోయిన బాధితుల‌కు ఆదుకునేందుకు ఏపీ ప్ర‌భుత్వం ఆర్థిక సాయం ప్ర‌క‌టించింది. ఒక వ్యక్తికి రూ. 1000, కుటుంబానికి గరిష్టంగా రూ.2 వేలు చొప్పున ఆర్థిక సాయం అందించాల‌ని ప్రభుత్వం ఉత్త‌ర్వులు జారీ చేసింది. బాధితులు పునరావాస కేంద్రాల నుండి ఇంటికి వెళ్ళినప్పుడు ఆర్థిక సాయాన్ని ఇవ్వాల‌ని అధికారుల‌ను ఆదేశించింది.తుఫాన్ ప్ర‌భావం ఎక్కువ‌గా ఉన్న నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, వై ఎస్సార్ జిల్లాల్లో ఎక్కువా ఉంది. దాంతో ఈ జిల్లాల్లోని తుఫాన్ బాధితులకు ఆర్థిక సాయం అంద‌నుంది.

Leave A Reply

Your email address will not be published.