వర్షాల వల్ల నష్టపోయిన రైతులకు ఎకరాకి రు.40 వేల ఆర్థిక సాయం

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: అకాల వర్షాల వల్ల జనగామ జిల్లాలోని గ్రామాల్లో చేతికి వచ్చిన పంటలు నష్టపోవాల్సి వచ్చింది. తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర బృందాలను పిలిపించి ఎన్యూమరేషన్ చేయించి నష్టపోయిన రైతులకు ఎకరాకి 40 వేల రూపాయల ఆర్థిక సాయం ఇవ్వాలని బీసీ సంక్షేమ యువజన విభాగం జనగాం జిల్లా అధ్యక్షులు  పండుగ హరీష్ ముదిరాజ్ డిమాండ్ చేసారు.ఈ సందర్భంగా ఆయన  మీడియా తో మాట్లాడుతూ రైతు ప్రభుత్వం అని గొప్పలు చెప్పుకుంటున్న ప్రభుత్వం రైతులను ఆదుకునే విషయం లో నిర్లక్ష్యం వహించడాన్ని ఆయన తప్పుబట్టారు. అదేవిధంగా కల్లాల్లో ఉన్న వరి ధాన్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేయాలని తెలిపారు. గత మార్చ్ లో కూడా కురిసిన అకాల వర్షాలకు  నష్టపోయిన రైతులకు ఎకరాకు 10 వేల నష్టపరిహారం ఇస్తానన్న ప్రభుత్వం ఇంతవరకు ఇవ్వక పోవడాన్ని శోచనీయ మన్నారు. వెంటనే నష్టపోయిన రైతులకు ఎకరాకి 40 వేల రూపాయల ఆర్థిక సాయం ప్రకటించాలని, నష్టపోయిన రైతులను ప్రభుత్వం అన్ని విదాల ఆదుకోవాలని, వ్యవసాయ అధికారులు జిల్లా యంత్రాంగం తక్షణమే స్పందించి పంట నష్టం అంచనా వేయాలని కోరుచున్నాము. నష్టపోయిన ప్రతి రైతుకు  పంట నష్టపరిహారం వచ్చేవరకు అండగా ఉంటామనిఈ సందర్బంగా  రైతులకు పండుగ హరీష్ ముదిరాజ్ బరోసానిచ్చారు.

Leave A Reply

Your email address will not be published.