తోటి మిత్రునికి ఆర్థిక సహాయం అందజేత

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్/బీర్కూర్ ప్రతినిధి:  మండల కేంద్రం బీర్కూర్ కు చెందిన మోటార్ రి వైండింగ్ మెకానిక్ గౌస్ గత వారం రోజుల క్రితం రోడ్డు ప్రమాదంలో కాళ్ళు, చేతులు విరిగి తీవ్రంగా గాయపడడంతో తోటి మిత్రులు, మోటార్ రి వైండింగ్ వర్కర్స్ యూనియన్ సభ్యులు గురువారం వారి ఇంటికి వెళ్లి పరామర్శించారు. ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకుని, మిత్రునికి అవసరం నిమిత్తం 12వేల రూపాయల ఆర్థిక సహాయం అందించారు. తమ మిత్రునికి ప్రభుత్వం ఆర్థికంగా ఆదుకోవాలని విజ్ఞప్తి చేసారు. ఈ కార్యక్రమంలో మండల మోటార్ రి వైండింగ్ వర్కర్స్ యూనియన్ సభ్యులు మైముద్, గొండ్ల గంగాధర్, మొయిన్, వహిద్, సాధఖ్, సుధాకర్, అలీం, తదితరులు ఉన్నారు.

Leave A Reply

Your email address will not be published.