యువ రైతులకు ఆర్థిక సహాయం అందజేత

తెలంగాణ జ్యోతి వెబ్ న్యూస్: కేరళలో 13 పశువులు ఆహార విషం కారణంగా మృత్యువాత పడ్డాయి. ఆ పశువులను 15 ఏళ్ల యువకులు పోషిస్తున్నారు. పశువులను కోల్పోవడంతో శోకసంద్రంలో మునిగిపోయారు. విషయం తెలుసుకున్న మలయాళ నటీనటులు యువ రైతులకు సహాయం చేస్తున్నారు. నటుడు జయరామ్  తెలుగు ప్రేక్షకులకు పరిచయమే. అల్లు అర్జున్ ‘అలవైకుంఠపురంలో’ సినిమాలో తండ్రిగా నటించారు. ఆయన ఈరోజు ఉదయం యువ రైతుల ఇంటికి చేరుకుని పిల్లలకు రూ.5 లక్షలు ఆర్థికసాయంగా అందించారు.  సోమవారం కేరళలోని వెల్లియమట్టంలో ఎండిన పచ్చిమిర్చి పొట్టు తిని యువ రైతు మాథ్యూ బెన్నీకి చెందిన 13 పశువులు మృతి చెందాయి. ఈ పశువులు ఇద్దరు యువకులు జార్జ్ (18), మాథ్యూ (15)లకు చెందినవి. గతంలో వీరు ఉత్తమ బాల పాడి రైతుగా రాష్ట్ర అవార్డును గెలుచుకున్నారు. తోడుపుజాలోని ఉత్తమ డైరీ ఫామ్‌లలో వీరిది ఒకటి. 13 చనిపోగా మరో 5 ఆవుల పరిస్థితి విషమంగా ఉందని తెలుస్తోంది. ఈ ఘటనతో  పంచాయతీ ద్వారా ఆ రైతులకు అందే అన్ని రకాల ప్రయోజనాలను అందజేస్తామని అధికారులు భరోసానిచ్చారు.  ఇక నటీనటులు కూడా స్పందిస్తున్నారు. తాజాగా జయరామ్ వారికి రూ.5 లక్షల ఆర్థిక సాయం అందించారు. అలాగే ఆ యువ రైతులకు మలయాళం స్టార్ నటుడు మమ్ముట్టి రూ.లక్ష, సలార్ Salaar నటుడు పృథ్వీరాజ్ రూ.2 లక్షలు ఇస్తానని హామీ ఇచ్చారని జయరామ్ పేర్కొన్నారు. ఈ రోజు సాయంత్రం ప్రత్యేక మెసెంజర్ ద్వారా ఇద్దరూ పిల్లలకు డబ్బు అందజేయనున్నట్లు తెలుస్తోంది.  అయితే జయరామ్ ఆర్థిక సాయం చేసిన డబ్బు రీసెంట్ గా కొత్త సినిమా ట్రైలర్ లాంచ్ కోసం వచ్చిందని తెలిపారు. తాను పెంచుకున్న ఆవులు కూడా ఇలాగే మృత్యువాత పడ్డాయని గుర్తు చేసుకున్నారు. ఆవులు చనిపోయినప్పుడు తాను, తన భార్య ఎక్కువగా ఏడ్చేవారని జయరామ్ తెలియజేశారు. అది గుర్తొచ్చే సాయం చేశారని తెలుస్తోంది. మరోవైపు కేరళ పశుసంవర్ధక శాఖ మంత్రి చించు రాణి, జలవనరుల శాఖ మంత్రి రోషి అగస్టిన్‌ ఈ ఉదయం యువ రైతుల ఇంటిని సందర్శించారు. బీమాతో కూడిన ఐదు ఆవులను రైతులకు అందజేయనున్నట్లు మంత్రి హామీనిచ్చినట్టు తెలుస్తోంది. నెల రోజుల పాటు ఉచితంగా ఆహారం అందజేస్తామని కూడా మంత్రి తెలిపారంట.

Leave A Reply

Your email address will not be published.