హైదరాబాద్ మహానగరంలో ఇటీవల ఫైర్ ఆక్సిడెంట్లు పెరిగిపోతున్నాయి

- కోదండ రెడ్డి,కాంగ్రెస్ సీనియర్ నేత

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్:హైదరాబాద్ మహానగరంలో ఇటీవల ఫైర్ ఆక్సిడెంట్లు పెరిగిపోతున్నాయని కోదండ రెడ్డి,కాంగ్రెస్ సీనియర్ నేత అన్నారు. గురువారం గాంధీ భావం లో మీడియా సమావేశంలో మాట్లాడారు. ఆస్తి నష్టం తో పాటు ప్రాణం నష్టం జరుగుతుంది. హెచ్ఎండిఏ తో పాటు ఫైర్ అధికారులు, టౌన్ ప్లానింగ్ అధికారులు నిబంధనలను తుంగలో తొక్కుతున్నారు. సంబంధిత మంత్రి కేటీఆర్,తెలంగాణ ప్రభుత్వం పట్టనట్టుగా వ్యవహరిస్తున్నారు. అధికారులు, ప్రభుత్వం బాధ్యతలను విస్మరిస్తున్నారు. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. తక్షణమే ప్రమాద నివారణ చర్యలు చేపట్టాలి. నిబంధనలు పాటించని నిర్మాణాలపై, కంపెనీలపై చర్యలు తీసుకోవాలి. జనావాసాల నుండి కంపెనీలను  రలించాలి. చెరుకు సుధాకర్,కాంగ్రెస్ నేత. ఆధనాతన యంత్రాలు పరికరాలు ఉపయోగించుకోవడంలో తెలంగాణ సర్కారు విఫలమైంది. పురాతన పద్ధతులతో అగ్ని ప్రమాదాలను నివారించలేకపోతున్నారు. ప్రమాదాలకు గల కారణాలను అంచనా వేయలేకపోతున్నారు. నిఘా సంస్థలు, నిర్వహణ సంస్థలు నిబంధనలు పాటించి చర్యలు తీసుకోవాలి. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడడం భావ్యం కాదన్నారు.

Leave A Reply

Your email address will not be published.