రేప్ కేసులో ఒకటో తరగతి పిల్లాడు అరెస్ట్!

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: ఇటీవల కాలంలో చిన్న పిల్లలపై అత్యాచార ఘటనలు ఎక్కువ అవుతున్నాయి. తోటి పిల్లలే వారిపై లైంగిక దాడికి పాల్పడుతున్నారు. ఏమీ తెలియని వయసులో శరీర నిర్మాణంపై కూడా అవగాహన లేని స్థితిలో సోషల్ మీడియా ప్రభావం ఓటీటీ కంటెంట్ తదితరాల ప్రభావంతో ఇలాంటివాటికి పాల్పడుతున్నారు.తాజాగా ఉత్తరప్రదేశ్లోని ముజఫర్ నగర్ లో మూడేళ్ల బాలికపై ఒకటో తరగతి చదువుతున్న బాలుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటనలో ఆ బాలుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం బాలుడు 1వ తరగతి విద్యార్థి కాగా బాలిక ప్లేగ్రూప్ విద్యార్థిని. వీరిద్దరూ ముజఫర్ నగర్ లో ఒక ప్లే స్కూలులో చదువుతున్నారని పోలీసులు తెలిపారు. ఆ బాలికకు మాయ మాటలు చెప్పి స్కూల్ మేడపైకి తీసుకెళ్లిన బాలుడు చిన్నారిని అత్యాచారం చేశాడని వివరించారు.ఘటన తర్వాత బాలిక ఏడుస్తూ తరగతి గదికి వచ్చి తన స్నేహితులకు చెప్పింది. వారు క్లాస్ టీచర్ కు చెప్పడంతో ఆమె చిన్నారి తల్లిదండ్రులకు విషయం వివరించింది. దీంతో బాలిక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో బాలుడిని పోలీసులు అదుపులోకి తీసుకోగా బాలికను వైద్య పరీక్షల నిమిత్తం తరలించారు.కాగా దేశంలో ఇలాంటి దారుణ ఘటన జరగడం ఇదే మొదటిసారి కాదు. గత ఏడాది మధ్యప్రదేశ్లోని ఇండోర్లో ఇలాంటి కేసు నమోదైంది అక్కడ 12 ఏళ్ల బాలుడు 3 ఏళ్ల బాలికపై అత్యాచారం చేశాడు.బాలిక కిరాణా దుకాణానికి వెళ్లినప్పుడు నిందితుడు అడ్డగించాడు. ఆమెకు చాక్లెట్లు ఇప్పిస్తానని మాయమాటలు చెప్పి తన ఇంటికి తీసుకెళ్లాడు.  అక్కడ లైంగిక దాడికి పాల్పడ్డాడు.చిన్న పిల్లలు కూడా సోషల్ మీడియా ప్రభావంతోపాటు ఓటీటీలు టీవీల్లో వస్తున్న అసభ్య సినిమాలు సీరియల్స్ చూసి చెడిపోతున్నారని పోలీసులు చెబుతున్నారు. తల్లిదండ్రులు పిల్లల విషయంలో జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. ఆడుకోమ్మంటూ ఫోన్లు ఇచ్చి వదిలేయకుండా.. వారు ఫోన్లలో ఏం చూస్తున్నారో.. యూట్యూబ్ లో ఏయే అంశాలపై సెర్చ్ చేస్తున్నారో ఒక కంట గమనిస్తూ ఉండాలని చెబుతున్నారు.

Leave A Reply

Your email address will not be published.