అమెరికాలో దివాళీ తీసిన ఫ‌స్ట్ రిప‌బ్లిక్ బ్యాంకు

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: అమెరికాలో మ‌రో బ్యాంకు దివాళీ తీసింది. ఫ‌స్ట్ రిప‌బ్లిక్ బ్యాంకును జేపీ మోర్గ‌న్ సంస్థ టేకోవ‌ర్ చేసుకోనున్న‌ది. ఈ విష‌యాన్ని ఫెడ‌ర‌ల్ డిపాజిట్ ఇన్సూరెన్స్ కార్పొరేష‌న్ స్ప‌ష్టం చేసింది. ఫ‌స్ట్ రిప‌బ్లిక్ బ్యాంకుకు చెందిన అన్ని డిపాజిట్లు, అసెట్స్‌ను ఇక నుంచి ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకింగ్ సంస్థ జేపీ మోర్గ‌న్ చూసుకోనున్న‌ట్లు ఆ ప్ర‌క‌ట‌న‌లో తెలిపారు. ఇటీవ‌ల అమెరికాకు చెందిన సిలికాన్ వ్యాలీ బ్యాంక్‌, సిగ్నేచ‌ర్ బ్యాంకులు దివాళా తీసిన విష‌యం తెలిసిందే. అయితే కొన్ని నెల‌ల తేడాలోనే అమెరికాలో మూడ‌వ బ్యాంకు మూత‌ప‌డింది.శాన్ ఫ్రాన్సిస్‌కోకు చెందిన ఫ‌స్ట్ రిప‌బ్లిక్ బ్యాంకు షేర్లు గ‌త వారం 75 శాతం ప‌డిపోయాయి. మార్చిలో క‌స్ట‌మ‌ర్లు సుమారు 100 బిలియ‌న్ల డాల‌ర్లు విత్‌డ్రా చేసుకున్న‌ట్లు ఆ బ్యాంకు వెల్ల‌డించింది. బ్యాంకుల మూసివేత‌తో అమెరికా ఆర్థిక వ్య‌వ‌స్థ అయోమ‌యంలో ప‌డింది. అయితే ఆర్థిక స్థిర‌త్వాన్ని తీసుకువ‌చ‌చేందుకు అమెరికా ఫెడ‌ర‌ల్ రిజ‌ర్వ్ ఎమ‌ర్జెన్సీ చ‌ర్య‌లు చేప‌ట్టింది.వాస్త‌వానికి అమెరికాకు చెందిన సుమారు 11 బ్యాంకులు మార్చి నెల‌లో ఫ‌స్ట్ రిప‌బ్లిక్ బ్యాంకులోకి 30 బిలియ‌న్ల డాల‌ర్లు ట్రాన్స్‌ఫ‌ర్ చేశాయి. ఫ‌స్ట్ రిప‌బ్లిక్‌ను స్థిరీక‌రించేందుకు ప్ర‌య‌త్నం చేసినా.. ఎటువంటి లాభం జ‌ర‌గ‌లేక‌పోయింది. 1985లో ఫ‌స్ట్ రిప‌బ్లిక్ బ్యాంకును స్థాపించారు.

Leave A Reply

Your email address will not be published.