పెన్నా నదిలో ఐదుగురు వ్యక్తులు గల్లంతు

.. రంగంలోకి పోలీసులు, ఫైర్ సిబ్బంది బోట్లు

తెలాంగాణ జ్యోతి/వెబ్ న్యూస్ : ప్రొద్దుటూరులోని పెన్నా నదిలో ఐదుగురు వ్యక్తులు గల్లంతయ్యారు. వారు కమలాపురం మండలంకంచన్నగారిపల్లె దగ్గర చెట్లను పట్టుకుని సాయం కోసం ఎదురు చూస్తున్నట్లు అధికారులుపోలీసులు గుర్తించారు. వారిని రక్షించేందుకు పోలీసులుఫైర్ సిబ్బంది బోట్లతో రంగంలోకి దిగారు. ఎగువ ప్రాంతాల్లో భారీవర్షాల కారణంగా కడప జిల్లాలో ఉధృతంగా పెన్నాకుందూ నదులు ప్రవహిస్తున్నాయి. కడప జిల్లాజమ్మలమడుగు డివిజన్‌లో కుండపోత వర్షం కురిసింది. గురువారం తెల్లవారుజామున భారీ వర్షం కురవడంతో అంతా జలమయమైంది. ఎక్కడ చూసినా నీళ్లు పొంగి పొర్లాయి. వరద నీరు పెరగడంతో కుందూ పోటెత్తింది. నెమళ్లదిన్నె వంతెనపై రెండు అడుగుల మేర ప్రవాహం పెరిగి పలు గ్రామాలకు రాకపోకలు నిలిచాయి. ఖరీఫ్‌ పంటలకు ప్రాణం పోస్తుందని ఆశించిన వర్షం రైతాంగానికి అపార నష్టాన్ని మిగల్చింది. పెద్దముడియంతో పాటు ఎగువప్రాంతాల్లో కురిసిన భారీ వర్షానికి కుందూ నది ఉధృతంగా పారుతోంది. నెమళ్లదిన్నె వంతెనపై రెండు అడుగుల మేర ప్రవాహం పెరిగి పలు గ్రామాలకు రాకపోకలు నిలిచాయి. పెద్ద పసుపుల నుంచి ఉలవపల్లెపాలేరు నుంచి పెద్దముడియంచిన్నపసుపుల నుంచి జమ్మలమడుగుఎన్‌.కొట్టాలపల్లె ఇలా.. పలు గ్రామాల మధ్య వంతెనలు పొంగడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. భారీ వర్షంతో గ్రామాల్లో లోతట్టు ప్రాంతాలు చెరువులను తలపించాయి. పలుచోట్ల ఇళ్లలోకి వర్షం నీరు వచ్చింది. పెద్దపసుపులలోని పలు అంగన్వాడీ కేంద్రాలుపాఠశాల ఆవరణంలోకి వర్షం నీరు చేరింది. అలాగే విద్యుత్‌ అంతరాయం కూడా తలెత్తింది. గురువారం సాయంత్రం వరకు విద్యుత్‌ పునరుద్ధరణ జరగక జనం అవస్థలు పడ్డారు. భారీ వర్షం కారణంగా పంట పొలాలన్నీ నీట మునిగాయి. ముఖ్యంగా పత్తిజొన్నమినుముపెసరసోయాబీన్‌ తదితర పంటలకు తీవ్ర నష్టం వాటిల్లిందని అన్నదాతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎస్‌ఐ శ్రీనివాసులు నెమళ్లదిన్నె కుందూ వద్ద పరిస్థితి సమీక్షించి సిబ్బందికి పలు సూచనలుసలహాలు ఇచ్చారు. అలాగే తహసీల్దారు జ్యోతి రత్నకుమారి సిబ్బందిని అప్రమత్తం చేసి తీసుకోవాల్సిన చర్యలను ఆదేశించారు. మండలంలో గురువారం 72 మిమీ వర్షపాతం నమోదైందని అధికారులు తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.