రైతుల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకునే.. RFCL ను కేంద్రం పునరుద్ధరించింది

.. ఎన్వీ సుభాష్, బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: ప్రధాని మోదీ తెలంగాణ పర్యాటనను అడ్డుకుంటామంటున్న టీఆర్ఎస్, దాని కొత్త మిత్రులైన సీపీఐ, సీపీఎం పార్టీలపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు బిజెపి రాష్ట్ర అధికార ప్రతినిధి ఎన్వీ సుభాష్. అవినీతి తప్ప, అభివృద్ధి అంటే ఏంటో కూడా తెలీని మీరా… మా ప్రధానిని అడ్డుకునేదని ఆయన ప్రశ్నించారు. గత ప్రభుత్వాల నిర్వాకం వల్ల మూతపడిన రామగుండం (RFCL) ఎరువుల కర్మాగారాన్ని పునరుద్ధరించి, జాతికి అంకితమిచ్చేందుకు ఈనెల 12న ప్రధాని రామగుండం వస్తున్నారని సుభాష్ తెలిపారు. తెలంగాణ సీఎం కేసీఆర్, తన దోస్తులైన సీపీఐ, సీపీఎంలతో కలిసి సమస్యలు సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారని…. ఎవరెన్ని కుట్రలు చేసినా… మోదీ పర్యటనను అడ్డుకోలేరని పేర్కొన్నారు. అరచేతిని అడ్డంపెట్టి, సూర్యుడి కాంతిని ఆపలేరని… అలానే దేశంలో అన్ని రాష్ట్రాలను సమదృష్టితో చూస్తూ… అభివృద్ధి చేస్తున్న ప్రధాని మోదీని అడ్డుకోవడం, ఈ దొంగల ముఠా తరం కాదని సుభాష్ హెచ్చరించారు. అసలు (RFCL) ఎరువుల ఫ్యాక్టరీని పునరుద్దరించడాన్ని కేసీఆర్ ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? ఈ కర్మాగారం వల్ల తెలంగాణ రైతులకే కాకుండా… యావత్ దేశ రైతాంగానికి ఎంతో ప్రయోజనం కలుగుతుందని ఎన్వీ సుభాష్ వెల్లడించారు.
రామగుండం ఎరువుల కర్మాగారంపై ‘బార్ అండ్ రెస్టారెంట్ సర్వీస్'(BRS) పార్టీ అధినేత కేసీఆర్ అసత్యాలు ప్రచారం చేస్తున్నారని… కేసీఆర్ ఎన్ని అబద్ధాలు చెప్పినా… తెలంగాణ ప్రజలు నమ్మే పరిస్థితి లేదన్నారు. రామగుండం ఎరువుల ఫ్యాక్టరీ మూతపడ్డదే కేసీఆర్ కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడని… ఈ విషయం కేసీఆర్ కు తెలీదా అని సుభాష్ ప్రశ్నించారు. మూతపడ్డ RFCL ను తెరిపించేందుకు కేసీఆర్ కానీ, ఆయన మంత్రిగా ప్రాతినిధ్యం వహించిన ప్రభుత్వం కానీ ఏమీ చేయలేదని కేసీఆర్ గుర్తుంచుకోవాలని సుభాష్ హితవుపలికారు. మోదీ చొరవ తీసుకుని, రూ. 6,120 కోట్ల వ్యయంతో RFCL ను పునరుద్ధరించారని ఎన్వీ సుభాష్ పునరుద్ఘాటించారు.

Leave A Reply

Your email address will not be published.