గత తొమ్మిదేళ్లుగా అణచి వేతలు,అక్రమకేసులతో వేదించారు

తెలంగాణ జ్యోతి వెబ్ న్యూస్: తెలంగాణ గెజిటెడ్ గెజిటెడ్ ఉద్యోగుల సంఘం,తెలంగాణా మునిసిపల్ ఉద్యోగుల సంఘం సంయుక్త ఆద్వర్యం లో గురువారం సచివాలయం లో ఉప ముఖ్య మంత్రి మల్లు బట్టి విక్రమార్కను గెజిటెడ్ గెజిటెడ్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అద్యక్షులు  ఏలూరు శ్రీనివాసరావు,పరమేశ్వర్ రెడ్డి, మునిసిపల్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అద్యక్షులు ఎల్.తాజ్ మోహన్ రెడ్డి లు  కలిసి కొత్త ప్రభుత్వానికి అభినందనలు  మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్బంగా  తెలంగాణ గెజిటెడ్ గెజిటెడ్ ఉద్యోగులు ,తెలంగాణా మునిసిపల్ ఉద్యోగులు తొమ్మిది సంవత్సరాలుగా ఎదురుకొంటున్న సమస్యలు, అణచి వేతళ్ళు, అక్రమకేసుల బనాయింపు, గత ప్రభుత్వం ఉద్యోగుల పట్ల అవలంబించిన వైఖరి  మొదలగు అంశాలపై  ఉప ముఖ్య మంత్రి కి వినతి పత్రం సమర్పించారు.తెలంగాణ ఉద్యమం సమయంలోనే తమ అసోసియేషన్ కు  చెందిన వివిధ గ్రేడ్లలోని గెజిటెడ్ ఉద్యోగులం ఉద్యమం లో పాల్గొన్న విశయాన్ని వారు వివరించారు.బిఆర్ఎస్ ప్రభుత్వం లో  గత తొమ్మిదే ళ్లుగా తీవ్ర అణచివేతకు గురయ్యామని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ ఏర్పాటు అయ్యాక కూడా పలు క్రిమినల్ కేసులు పెట్టారని,గత ప్రభుత్వం హయాంలో ఒక ఫోన్ కాల్ చేసుకునే పరిస్థితి లేదని ఆవేదన వ్యక్తం చేసారు.  గత ప్రభుత్వ హయాంలో జరిగిన  జరిగిన అవకతవక లపై జ్యూడిషియల్ ఎంక్వయిరీ జరిపించాలని విజ్ఞప్తి చేసారు. అప్పటి వరకు ఆఫీస్ బేరర్లుగా ఉన్న వారి ఆదేశాలు అమలుపరచొద్దని, నూతన ప్రభుత్వానికి తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ తరపున సంపూర్ణ సహకారం ఉంటుందని ఆయన తెలిపారు. ఇకనుంచి ఉద్యమం సమయంలో ఉద్యోగ సంఘాలు, జేఏసీలు ఎలా ఉండేవో అలాంటి వాటినే మళ్ళీ తయారు చేస్తామన్నారు.

Leave A Reply

Your email address will not be published.