రానున్న ఐదు రోజులు .. జాగ్రత్త

తెలంగాణ జ్యోతి/ వెబ్ న్యూస్: తెలంగాణలో ఇప్పటికే భానుడు భగ్గుమంటున్నాడు. భానుడి భగభగలతో ప్రజలు అల్లాడిపోతున్నారు. ఎండ ప్రతాపంతో పాటు తీవ్ర వడగాల్పులు వీస్తున్నాయి. దీంతో పాటు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉక్కబోతతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. కొద్దిరోజులుగా తెలంగాణలో ఉష్ణోగ్రతలు భారీగా పెరుగుతుండగా.. రాబోయే ఐదో రోజుల్లో మరింత పెరగనున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అంచనా వేసింది.రానున్న ఐదు రోజుల పాటు ఉష్ణోగ్రతలు 2 డిగ్రీల సెల్సియస్ నుంచి 3 డిగ్రీల వరకు ఎక్కువగా నమోదయ్యే అవకాశముందని వాతావరణశాఖ తెలిపింది. 15వ తేదీ నుంచి 19వ తేదీ వరకు రాష్ట్రంలో పొడి వాతావరణం ఉంటుందని, ఎండల తీవ్రత బాగా ఎక్కువగా ఉంటుందని తెలిపింది. రాబోయే ఐదు రోజుల పాటు ప్రజలు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించింది. అవసరమైతే తప్ప బయటకు వెళ్లొద్దని సూచనలు జారీ చేసింది. రాష్ట్రంలో ఆదివారం నల్లగొండలో అత్యధిక ఉష్ణోగ్రత 43 డిగ్రీలు నమోదవ్వగా.. మెదక్‌లో అత్యల్ప ఉష్ణోగ్రత 21 డిగ్రీలు నమోదైంది.దాదాపు అన్ని ప్రాంతాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలకుపైగా, కనిష్ట ఉష్ణోగ్రతలు 25 డిగ్రీలకుపైగా నమోదయ్యాయి. నిన్న ఆదిలాబాద్‌లో గరిష్టం 42.5, కనిష్టం 23.7, భద్రాచలంలో గరిష్టం 40.2, కనిష్టం 26, హకీంపేట్‌లో గరిష్టం 40, కనిష్టం 26, దుండిగల్‌లో గరిష్టం 39.9, కనిష్టం 24.7, హనుమకొండలో గరిష్టం 40.5, కనిష్టం 23.5, హైదరాబాద్‌లో గరిష్టం 39.7, కనిష్టం 26.4, ఖమ్మంలో గరిష్టం 39.6, కనిష్టం 30 డిగ్రీలు నమోదైంది. ఇక మహబూబ్‌నగర్‌లో గరిష్టం 39, కనిష్టం 27.5, మెదక్‌లో గరిష్టం 42, కనిష్టం 21, నల్లగొండలో గరిష్టం 43, కనిష్టం 24.4, నిజామాబాద్‌లో గరిష్టం 42.5, కనిష్టం 26.8, రామగుండంలో గరిష్టం 42, కనిష్టం 22.4, హయత్‌నగర్‌లో గరిష్టం 39.5, కనిష్టం 24.8, పటాన్‌చెర్వులో గరిష్టం 38.8, కనిష్టం 22.8, రాజేంద్రనగర్‌లో గరిష్టం 39.5, కనిష్టం 23 డిగ్రీలు నమోదైంది.శిశువులు, వృద్ధులు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నవారు జాగ్రత్తగా ఉండాలని, బయటకు రాకపోవడం మంచిదని సూచిస్తున్నారు. మంచినీరు ఎక్కువగా త్రాగుతూ ఉండాలని, తేలికైన, లేత రంగు, వదులుగా ఉండే కాటన్ దుస్తులను ధరించాలని చెబుతున్నారు. బయటకు వస్తే తలను వస్త్రం లేదా టోపీతో కప్పుకోవాలని, గొడుగు ఉపయోగించాలని సూచిస్తున్నారు. వేడి గాలులకు గురి కాకుండా చల్లని ప్రదేశాల్లో ఉండాలని, లస్సీ, నిమ్మకాయ నీరు, మజ్జిగ వంటి వాటిని తీసుకుంటే మంచిదని సూచిస్తున్నారు.బాబోయ్ ఎండలు.. బండరాయి పగిలిపోయింది

Leave A Reply

Your email address will not be published.