రాజ్యాధికారం కోసం బడుగు బలహీన వర్గాలు బానిస భావన విడనాడాలి

-  ఓట్లు విప్లవం ద్వారానే రాజ్యాధికారం సాద్యం    - బీసీ సంక్షేమ సమితి రాష్ట్ర అధ్యక్షులు బొల్క వెంకట్ యాదవ్

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: మన రాష్ట్రంలో దాదాపు 24 శాతం దళితులు, 54 శాతం బిసిలు, 12 శాతం ముస్లిం మైనారిటీలు, ఇతరులు కూడా ఒకటి, రెండు శాతం ఉన్నారు. దాదాపు 90 శాతం పైగా ఉన్న అణగారిన వర్గాలు ఒకటి, రెండు శాతం ఉన్న వర్గాలను యాచించే పరిస్థితి కొనసాగుతుందని బీసీ సంక్షేమ సమితి రాష్ట్ర అధ్యక్షులు బొల్క వెంకట్ యాదవ్ ఆవేదన వ్యక్తం చేసారు.. మైనారిటీ కులాలైన కమ్మలు వెలమలు వైశ్యులు బ్రాహ్మణులు రెడ్ల ను మాకు ఆ‌ పథకం కావాలి, ఈ పథకం కావాలి, కార్పొరేషన్లు కావాలి అని గత 75 సంవత్సరాలుగా అడుగుతూనే ఉన్నాం. వారు కనీసం ఉచిత విద్య, వైద్యం, ఉపాధి అవకాశాలు కల్పించింది కూడా లేదన్నారు.అధికారం లో ఉన్న వారి సామాజిక వర్గాలు కీలకమైన పదవులు అనుభవిస్తూ తమ సామాజిక వర్గాలకి తక్కువ ధరకు భూములు కేటాయించడం, పరిశ్రమలకు, సబ్సిడీలు, అనుమతులు మంజూరు చేసి దినదినాభివృద్ధి చెందడం. వారి వద్ద మనం కూలి పనులు చేసుకుంటూ వెట్టిచాకిరి చేస్తూ, దుర్భర పరిస్థితుల్లో జీవనాలు కొనసాదిస్తున్నరన్నారు. మన దగ్గర పన్నులు వసూలు చేసి, అధికారంలో ఉన్న వారు సొంత ఖర్చులకు వాడుకుని మిగతాది వారి పేర్లు, వారి తండ్రి తాతల పేర్లు తో పథకాలు తయారు చేసి మనకు తిరిగి ఇస్తూ, ఒకరు మార్చి ఒకరు అధికారంలోకి రావడానికి వారి సొంత డబ్బు మనకు ఇస్తున్నట్లు అసత్య ప్రచారాలు చేసుకుని మనల్ని నమ్మించడం జరుగుతుంది. అది నిజమని మనం నమ్మడం మన అవివేకం అవుతుందన్నారు.బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి రాజ్యాంగం కల్పించిన రిజర్వేషన్లకు తూట్లు పొడుస్తూ మన అభివృద్ధికి అడ్డంకులు సృష్టించడం, మన మీదే దాడులు, దౌర్జన్యాలు, హత్యలు, మానభంగాలు లూటీలు కబ్జాలు చేయడం నిత్యం ఎక్కడో ఒకచోట జరుగుతూనే ఉంది. అలాంటి దౌర్జన్యాలు, కబ్జాలకు కూడా బిసి ఎస్సీ ఎస్టీలను పావులుగా వాడుకోవడం జరుగుతుంది. ఒకవేళ ఉన్నత కులాల వారు నేరుగా దాడులు, దౌర్జన్యాలు చేసినా రాజ్యాధికారం వారి చేతుల్లో ఉండటం వల్ల వారు తప్పించుకోవడం జరుగుతుందన్నారు. బిసిలు ఎస్సీ ఎస్టీ మరియు మైనారిటీలు అంతర్గత ఐక్యత సాధించాలి. రాజ్యాధికారం కోసం బడుగు బలహీన వర్గాలు చేయి చేయి కలిపి బానిస భావన నుంచి బయటపడాలి. బడుగు బలహీన వర్గాలు అధికారం లో ఉన్నప్పుడు రాజకీయ, ఆర్థిక, సామాజికంగా జనాభా ప్రాతిపదికన ప్రతి ఒక్కరూ ( ఉన్నత కులాల సహా) తమ హక్కులు సాధించు కోవడానికి వీలౌతుందన్నారు.

Leave A Reply

Your email address will not be published.