ఆరు గ్యారంటీల హామీల అమలుపై నిపుణుల కమిటీ ఏర్పాటు

తెలంగాణ జ్యోతి వెబ్ న్యూస్: రాష్ట్రంలో కొత్తగా ఎన్నికైన కాంగ్రెస్ ప్రభుత్వం సంక్షేమానికి ఆరు గ్యారంటీల హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన విషయం రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు అని,ప్రస్తుత రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎలా ఉందో ప్రభుత్వమే విడుదల చేసిన శ్వేత పత్రం ద్వారా తేటతెల్లం కావడంతో రాష్ట్ర ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా రాష్ట్రంలో జరగ వలసిన అభివృద్ధి, అర్హులైన వారికి అందవలసిన సంక్షేమ పథకాల హామీల అమలు మధ్య సమతూకం సాధించాల్సి న గురుతర బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉందని లోక్ సత్తాపార్టీ భావిస్తోందని ఇందుకుగాను ప్రభుత్వం వెంటనే ఆర్థిక, సామాజిక రంగ నిపుణుల కమిటీని వెంటనే ఏర్పాటు చేయాలని లోక్ సత్తపార్టి రాష్ట్ర అధ్యక్షులు తుమ్మనపల్లి శ్రీనివాసు డిమాండ్ చేశారు. 2014-15 లో బడ్జెట్ రుణ భారం సుమారు 72 వేల కోట్లు కాగా ప్రస్తుతం రాష్ట్ర వార్షిక రెవెన్యూలో 34 శాతం డబ్బులు అప్పులు చెల్లించటానికే సరిపోతుందని, రాష్ట్ర ప్రభుత్వం పేర్కొన్న అప్పుల్లో ప్రభుత్వం విధిగా చెల్లించాల్సిన అవసరం లేనివి పక్కన బెట్టి, బడ్జెట్ అప్పులు, బడ్జెట్ బయట రుణాలు, కాంట్రాక్టర్లకు చెల్లించాల్సిన సుమారు 40వేల కోట్లను లెక్కిస్తే ప్రస్తుతం రాష్ట్ర రుణ భారం 5,50,000 కోట్లుగా తేలింది అని ఆయన అన్నారు. రాష్ట్ర స్థూల ఆదాయంలో అప్పుల నిష్పత్తి 39 శాతానికి చేరడం, రోజు వారీ ఖర్చులకు సైతం రిజర్వు బ్యాంక్ నుంచి ప్రభుత్వం ఓవర్ డ్రాఫ్ట్ రుణం తీసుకుని అధిక వడ్డీ చెల్లించాల్సి రావడం దురదృష్ట కర పరిణామమని తుమ్మనపల్లి అన్నారు. అప్పులు చేసి తాత్కాలిక పథకాలు రాష్ట్ర ఖజానాను దివాలా తీయించే పనులను ప్రభుత్వం చేపట్టవద్దని ఆయన కోరారు. ఇంకా ఈ సమావేశంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు నందిపేట రవీందర్, ప్రధాన కార్యదర్శి శ్రీనివాస వర్మ, కార్యదర్శి మల్లాది కిషోర్, వంశీ ప్రసాద్, మాచవరం శ్రీధర్ రావు, యం. ఫనిధర్ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.