ఈవీఎం లపై అనుమానం వ్యక్తం చేసిన మాజీ సీఎం

తెలంగాణ జ్యోతి వెబ్ న్యూస్: ఈవీఎంలలో ఏదో జరిగిపోతా ఉందని అంతా గగ్గోలు పెడుతున్నారు. 2014 ఎన్నికల్లో మా మీదు (చంద్రబాబు) గెలిచారు. అప్పుడు ఈవీఎంలతోనే గెలిచారు కదా. మరి అప్పుడు ఈవీఎంలు ట్యాంపర్ చేసే గెలిచారనుకోవాలా..?’’ అదే ఏడాది మరోసారి జగన్‌ ఏమన్నారంటే…. ‘‘80 పర్సెంటేజీ జనాభా వెళ్లి పోలింగ్ బూత్‌లో బటన్‌ నొక్కారు. బటన్‌ నొక్కిన తర్వాత వారు ఏ పార్టీకి ఓటేశారన్నది వీవీ ప్యాట్‌లో కనిపిస్తుంది. వాళ్లు వేసిన ఓటు, వీవీ ప్యాట్‌లో కనిపించిన ఓటు రెండూ మ్యాచ్‌ అయ్యాయి కాబట్టే.. ఓటర్లు సంతృప్తి చెంది, బూత్‌లో నుంచి బయటకు వచ్చారు. ఇలా ఓటేసిన 80 శాతం మందిలో ఎవరూ కంప్లైంట్‌ చేయలేదు. నేను ఫ్యాన్‌ గుర్తుకు ఓటేశాక.. నాకు సైకిల్‌ గుర్తు కనిపిస్తే నేనేందుకు గమ్మునుంటా..? గమ్మునుండను కదా. అక్కడే గొడవ చేసి.. వెంటనే కంప్లైంట్‌ చేసేవాడిని. అలా ఓటేసిన వారికి.. వేరే పార్టీకి ఓటు వేసినట్లు వీవీ ప్యాట్‌లో కనిపించలేదు కాబట్టే అందరూ శాటిస్‌ఫై అయ్యారు. కాబట్టే పోలింగ్‌ బూత్‌లో గానీ, పోలింగ్‌ ఆఫీసర్‌ దగ్గర గానీ ఎవరూ కంప్లైంట్‌ ఇవ్వలేదు. ఇవన్నీ చంద్రబాబు నాయుడికి తెలిసే.. తానెవరికి ఓటేశానో తనకే తెలియదని చెప్పి డ్రామాలు చేయడం ఎంతవరకు ధర్మం అని అడుగుతున్నా..” అంటూ జగన్‌ గత ఎన్నికల సమయంలో సెటైర్లు వేశారు.  ఇప్పుడేమో ఈవీఎంలు వద్దు బ్యాలెట్ పేపరే ముద్దు అన్నట్లు జగన్ చేసిన ట్వీట్ సంచలనం రేపుతోంది. ‘‘న్యాయం జరగడం మాత్రమే కాదు, జరిగినట్లు కనిపించాలి కూడా. అలాగే ప్రజాస్వామ్యం ప్రబలంగా ఉండటమే కాకుండా నిస్సందేహంగా ప్రబలంగా కనిపించాలి.  ప్రపంచ వ్యాప్తంగా దాదాపు ప్రతి అభివృద్ధి చెందిన ప్రజాస్వామ్య దేశంలో పేపర్ బ్యాలెట్ పద్ధతిలోనే ఎన్నికలు నిర్వహిస్తున్నారు, EVMలు కాదు.  నిజమైన ప్రజాస్వామ్య స్ఫూర్తిని నిలబెట్టుకోవాలంటే మనం కూడా అదే దిశగా పయనించాలి (పేపర్ బ్యాలెట్ వాడాలి).’’ అంటూ జగన్ చేయడం చర్చనీయాంశంగా మారింది.

Leave A Reply

Your email address will not be published.