మాజీ మంత్రి ధర్మపురి శ్రీనివాస్ కన్నుమూత

తెలంగాణ జ్యోతి వెబ్ న్యూస్: కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి ధర్మపురి శ్రీనివాస్ కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న శ్రీనివాస్.. తెల్లవారు జామున 3.30 గంటలకు తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని ఆయన కుమారుడు ధర్మపురి అరవింద్ ట్విటర్ వేదికగా వెల్లడించారు. ‘అన్నా.. అంటే నేనున్నా అని.. ఏ ఆపదలో అయినా ఆదుకునే శీనన్న ఇక లేరు. నా తండ్రి, నా గురువు అన్నీ మా నాన్నే.! ఎదురొడ్డు, పోరాడు, భయపడకు అని నేర్పింది మా నాన్నే.. ప్రజలను ప్రేమించు, ప్రజల కొరకే జీవించు అని చెప్పింది మా నాన్నే. నాన్నా..! నువ్వు ఎప్పటికీ నాతోనే ఉంటావు ఎప్పటికీ నా లోనే ఉంటావు’ అని ఎంపీ ధర్మపురి అరవింద్ ట్వీట్ చేశారు.

డి.శ్రీనివాస్ సుదీర్ఘ కాలం పాటు కాంగ్రెస్లో కొనసాగారు. ఉమ్మడి ఏపీలో మంత్రిగా, ఎంపీగా, పీసీసీ అధ్యక్షుడిగా పని ໖.1989, 99, 2004 ລ້ລ້ మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. సుదీర్ఘ కాలం పాటు పీసీసీ అధ్యక్షుడిగా పని చేశారు. రాష్ట్ర విభజన అనంతరం ఆయన బీఆర్ఎస్లో చేరారు. కొద్ది రోజుల పాటు ప్రభుత్వ సలహాదారుగా ఉన్నారు. ఎంతో ఉన్నతమైన పదవులు అనుభవించి మహోన్నతమైన రాజకీయ నేతగా పేరుందిన డి శ్రీనివాస్ మరణం ఆయన అభిమానులు కాంగ్రెస్ పార్టీ శ్రేణులలో నిరుత్సాహాన్ని నింపింది.

Leave A Reply

Your email address will not be published.