బిపి షుగర్ బాధితులకు ఉచితంగా మందుల పంపిణీ

తెలంగాణ జ్యోతి/ వెబ్ న్యూస్: రాష్ట్ర ప్రభుత్వం పేదల ఆరోగ్య పరిరక్షణకు అత్యంత ప్రాధాన్య తనిస్తునది, ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు ఖరీదైన వైద్యాన్ని అందుబాటులోకి తీసుకొచ్చి వైద్యాన్ని ఉచితంగా అందిస్తున్నదని, డాక్టర్ నిఖిల్ , డాక్టర్ అఖిల అన్నారు, అనంతరం వారు మాట్లాడుతూ. పేదల పరిస్థితి చూసి ప్రభుత్వమే బీపీ, షుగర్ వంటి వ్యాధుల బారిన పడుతున్న వారిపైన ప్రత్యేక దృష్టి సారించింది, నస్రుల్లాబాద్ మండల కేంద్రంలోని ఆరోగ్య సిబ్బంది ఆధ్వర్యంలో రైతు వేదికలో ఉచితంగా బీపీ , షుగర్ రోగాలతో బాధపడుతున్నట్లు వైద్య ఆరోగ్యశాఖ గుర్తించింది , ఈ వ్యాధులు ప్రాణాంతకం కాకపోయినా, మందులను క్రమం తప్పకుండా వేసుకుంటే మాత్రం ప్రాణాంతకంగా మారే ప్రమాదం ఉన్నది, దీంతో రాష్ట్ర ప్రభుత్వం పేదల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని బీపీ,షుగర్ వ్యాధిగ్రస్తులకు కొందరికి ఉచితంగా అవసరమైన కిట్లను బీపీ,షుగర్ మందులను ఉచితంగా పంపిణీ చేశారు, ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రంలో బీపీ , షుగర్ బాధితులకు ఆరోగ్య సిబ్బంది ఉచితంగా అందజేశారు, కార్యక్రమంలో పాల్గొన్న వారు. డాక్టర్ నిఖిల్, డాక్టర్ అఖిల, ఏఎన్ఎంలు వెంకటలక్ష్మి, అర్చన, ఆశా వర్కర్స్ కవిత, లావణ్య, ఆరోగ్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.