గోశాలలో ఉన్న ఆవులకు విముక్తి చేయండి

  రెండు తెలుగు రాష్ట్రాల హైకోర్టు లో ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం పిల్ రైతు సంక్షేమ సేవా సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు కొమ్ము ప్రేమ్ సాగర్ యాదవ్

తెలంగాణ జ్యోతి వెబ్ న్యూస్: గోశాలలో ఉన్న ఆవులు రైతులకు ఇవ్వాలని కోరుతూ రైతు సంక్షేమ సేవా సంఘం ఆద్వర్యం లో రెండు తెలుగు రాష్ట్రాల హైకోర్టులో ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం క్రింద ఫిల్ దాకలు చేసినట్లు రైతు సంక్షేమ సేవా సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు కొమ్ము ప్రేమ్ సాగర్ యాదవ్ తెలిపారు.  ఈ సందర్బంగా మాట్లాడుతూ  గోశాలలో ఉన్న ఆవులు సరైన ఆహారము లేక సరైన వాతావరణం లేక ఇరుకైన ప్రదేశంలో ఉంటూ బక్క చిక్కిపోయి చనిపోతున్నాయని ఆవీదన వ్యక్తం చేసారు. ఈ ఆవులను రైతు వద్ద ఉంటే ఎంతో సుఖపడుతుంది వ్యవసాయానికి ఉపయోగపడుతుంది సేంద్రియ పద్ధతిలో రైతులు వ్యవసాయం చేస్తే భూమి ఎంతో సారవంతమై మంచి పంటలు పండుతాయి ఆ పంటలు తిన్న సమాజము ఆరోగ్యవంతులైతారు అంతేకాకుండా ఆవు రైతుల వద్ద ఉంటే ఎన్నో ప్రయోజనాలు ఉంటాయని కొమ్ము ప్రేమ్ సాగర్ యాదవ్ తెలిపారు. ఈ సృష్టిలో ఆవుకు ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది మానవునితో సహజీవనం గడిపే జంతువు ఒక ఆవు మాత్రమే అలాంటి ఆవులు రైతుల వద్ద లేకపోవడం చాలా బాధాకరమన్నారు. ఆవులు కూడా చాలా వరకు  అంతరించిపోవడంతో  వింత వింత జబ్బులు ఎన్నో విరోధాలు సంక్రమిస్తూ మనిషి ముప్పుతెచ్చుకుంటున్నాడన్నారు.ఇప్పటికైనా అందరూ మేల్కొని గోశాలలో ఉన్న ఆవులను రైతుల వద్దకు పంపించి వ్యవసాయానికి కృషి చేయాలని ప్రేమ్ సాగర్ హైకోర్టులో పిల్ వేయడం జరిగింది. ఈ మంచి కార్యక్రమానికి అందరూ కూడా సహకరించగలరని ప్రేమ్ సాగర్ విజ్ఞప్తి చేసారు. ఇందులో నాకు ఎలాంటి స్వలాభం కానీ స్వార్థం గాని లేదని, లోక కళ్యాణం కొరకు ఒక మంచి మార్పు కొరకు అందరిని ఏకం చేసి ఆరోగ్యకరమైన నవ సమాజం నిర్మించాలని కొమ్ము ప్రేమ్ సాగర్ యాదవ్ పిలుపునిచ్చారు.ప్రజాప్రయోజనాల నిమిత్తము వేసిన పిల్.కు సానుకూలంగా తీర్పు ఆదేశము కోర్టు నుండి వస్తదన్న  ధీమాను, ఆశాభావాన్ని ప్రేమ్ సాగర్ యాదవ్  వ్యక్తము చేసారు.

Leave A Reply

Your email address will not be published.