గణేష్ లడ్డు @ 1.26 కోట్లు

తెలంగాణ జ్యోతి /వెబ్ న్యూస్/ప్రత్యేక ప్రతినిధి: బండ్లగూడ జాగిర్ మున్సిపల్ పరిధిలోని ఆరో వార్డులో బి ఆర్ చారిటబుల్ ట్రస్ట్ వారు గణేష్ లడ్డూను రికార్డు స్థాయిలో వేలంపాటలో పాడి దక్కించుకున్నారు. హైదరాబాద్ రంగారెడ్డి సంయుక్త జిల్లాలలో ఎక్కడ లేని విధంగా ఒక కోటి 26 లక్షల రూపాయలకు లడ్డూ వేలంను పాడి లడ్డును స్వాధీనం చేసుకున్నారు. గణేష్ నవరాత్రి ఉత్సవాల చరిత్రలో ఇది ఎప్పటికీ నిలిచిపోయే రికార్డుగా పలువురు పేర్కొంటున్నారు.

Leave A Reply

Your email address will not be published.