లంచం తీసుకుంటూ పట్టుబడ్డ జీహెచ్‌ఎంసీ ఆఫీసర్‌ రాజశ్రీకి రెండేళ్లు జైలు శిక్ష

తెలంగాణ జ్యోతి/ వెబ్ న్యూస్: ఏసీబీ కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. 2012లో రూ.20 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన జీహెచ్‌ఎంసీ సెక్షన్‌ ఆఫీసర్‌ రాజశ్రీకి రెండేళ్లు జైలు శిక్ష విధించినట్లు ఏసీబీ కోర్టు తెలిపింది. ఆమెకు రూ.10 వేలు జరిమానా విధించినట్లు ఏసీబీ కోర్టు పేర్కొంది. అప్పట్లో ఈ ఘటన సంచలనానికి దారి తీసింది.మరోవైపు.. నకిలీ జననమరణ ధ్రువీకరణ పత్రాలజారీకి సంబంధించి విజిలెన్స్‌ విచారణకు జీహెచ్‌ఎంసీలోని కేంద్ర కార్యాలయ అధికారులు పూర్తిస్థాయి వివరాలు ఇవ్వడంలేదు. సరైన పత్రాలు లేకుండా నగరంలోని 15 మీసేవా కేంద్రాల నుంచి 25,743 నకిలీ జనన/మరణ ధ్రువీకరణ పత్రాలు జారీ అయినట్టు అధికారులు గుర్తించారు. నూతన సాఫ్ట్‌వేర్‌లో ఇన్‌స్టంట్‌ అప్రూవల్‌ ఆప్షన్‌ వల్లే అక్రమాలు జరిగినట్టు దాదాపుగా నిర్ధారణ అయింది. అయితే మొత్తం వ్యవహారంలో మీ సేవ కేంద్రాల పాత్ర ఎంతజీహెచ్‌ఎంసీఅధికారులుఉద్యోగులకు సంబంధముందా అన్నది తేల్చేందుకు అటు పోలీసులుఇటు విజిలెన్స్‌ అధికారులు విచారణ జరుపుతున్నారు. ఈక్రమంలోనే కేంద్ర కార్యాలయంలోని నాలుగో అంతస్తులో ఉన్న సంబంధిత విభాగానికి విజిలెన్స్‌ అధికారులు ఇప్పటికే రెండుమూడు పర్యాయాలు వచ్చారు. అయినా పూర్తిస్థాయి సమాచారం ఇవ్వడం లేదని విజిలెన్స్‌ వర్గాలు చెబుతున్నాయి.

Leave A Reply

Your email address will not be published.