ఉమ్మడి పౌర స్మృతి పై అభిప్రాయాలను తెలియజేయండి

- మతపరమైన సంస్థలను కోరిన  22వ భారత శాసన పరిశీలక సంఘం

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: ఉమ్మడి పౌర స్మృతి పై అభిప్రాయాలను తెలియజేయాలని ప్రజలుమతపరమైన సంస్థలను 22వ భారత శాసన పరిశీలక సంఘం కోరింది. 2018లో ఈ కమిషన్ విడుదల చేసిన ‘‘రిఫార్మ్స్ ఆఫ్ ఫ్యామిలీ’’పై కన్సల్టేషన్ పేపర్‌లో ‘‘ఈ దశలో యూసీసీ ఏర్పాటు అవసరం లేదువాంఛనీయం కాదు’’ అని తెలిపింది. అయితే ప్రస్తుతం తాజాగా అభిప్రాయాలను సేకరించాలని నిర్ణయించింది. కేంద్ర న్యాయ మంత్రిత్వ శాఖ పంపిన రిఫరెన్స్‌ను కమిషన్ పరిశీలిస్తోంది.21వ శాసన పరిశీలక సంఘం 2016, 2018 సంవత్సరాల్లో యూసీసీని పరిశీలించింది. వివిధ కోర్టు తీర్పుల నేపథ్యంలో దీని ప్రాధాన్యాన్ని దృష్టిలో ఉంచుకుని తాజాగా మరోసారి అభిప్రాయాలను సేకరించాలని నిర్ణయించినట్లు లా కమిషన్ బుధవారం విడుదల చేసిన ప్రకటన తెలిపింది. ప్రజలుగుర్తింపు పొందిన మత సంస్థలు 30 రోజుల్లోగా తమ అభిప్రాయాలను సమర్పించాలని తెలిపింది.

దేశంలోని పౌరులందరికీ చట్టాలు సమానంగా వర్తించడమే ఉమ్మడి పౌర స్మృతి. వివాహంవిడాకులుదత్తతవారసత్వం వంటి అంశాల్లో మతంతో సంబంధం లేకుండా అందరికీ సమానంగా చట్టాలను అమలు చేయడమే ఉమ్మడి పౌర స్మృతి. ఇటువంటి అంశాల్లో ప్రస్తుతం వేర్వేరు మతస్థులకు వేర్వేరు చట్టాలు అమలవుతున్న సంగతి తెలిసిందే. ఈ పరిస్థితిని తొలగించిదేశంలోని ప్రజలందరికీ ఒకే నిబంధనలు వర్తించే విధంగా చేయడం కోసం ఉమ్మడి పౌర స్మృతిని అమలు చేయాలనే అభిప్రాయాలను కొందరు వ్యక్తం చేస్తున్నారు. భారత రాజ్యాంగంలోని ఆదేశిక సూత్రాల్లో అధికరణ 44 కూడా ఇదే విషయాన్ని చెప్తోంది. అయితే దీనిని కోర్టులు అమలు చేయజాలవని అధికరణ 37 చెప్తోంది.

Leave A Reply

Your email address will not be published.