టోల్ ఫీజుల వసూళ్ల నుండి తప్పుకున్న జిఎంఆర్

తెలంగాణ జ్యోతి వెబ్ న్యూస్: జాతీయ రహదారిపై టోల్ ఫీజు వసూళ్ల కాంట్రాక్ట్ నుంచి జీఎమ్మార్ సంస్థ వైదొలగింది. మరో ఏడాది పాటు వసూళ్లకు అవకాశం ఉన్నా.. ముందుగానే బాధ్యతల నుంచి తప్పుకోవడం గమనార్హం. దీంతో జులై 1 అర్ధరాత్రి నుంచి టోల్ వసూళ్లు నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎన్‌హెచ్‌ఏఐ) ఆధ్వర్యంలో ప్రారంభమయ్యాయి. కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వ హయాంలో రెండు వరుసలుగా విజయవాడ హైవేను నాలుగు వరుసలుగా విస్తరించేందుకు పనులు చేపట్టారు. ఇందుకు సంబంధించిన రూ.1740 కోట్ల కాంట్రాక్ట్‌ను 2009లో జీఎమ్మార్‌ సంస్థ దక్కించుకుంది.యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌ మండలం దండుమల్కాపురం నుంచి ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా జిల్లా నందిగామ వరకు 181.5 కి.మీ. పొడవునా నాలుగు వరుసలుగా జాతీయ రహదారిని నిర్మించింది. దీనిపై మూడు చోట్ల తెలంగాణలోని పంతంగి, కొర్లపహాడ్.. ఏపీలోని చిల్లకల్లు వద్ద టోల్‌ప్లాజాలను ఏర్పాటుచేసింది. డిసెంబరు 2012 నుంచి టోల్‌ ఫీజు వసూళ్ల బాధ్యత, హైవే నిర్వహణను కూడా జీఎమ్మార్‌ సంస్థకే అప్పగించారు.

Leave A Reply

Your email address will not be published.