గో బ్యాక్ ఎమ్మెల్యే..

వికారాబాద్ లో కార్యకర్తల నిరసన

తెలంగాణ జ్యోతి వెబ్ న్యూస్: చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య కాంగ్రెస్‌లో చేరడాన్ని స్థానిక హస్తం నేతలు వ్యతిరేకిస్తున్నారు. కాలె యాదయ్య చేరికను నిరసిస్తూ వికారాబాద్‌ జిల్లా నవాబుపేటలో మండల కాంగ్రెస్‌ వర్కింగ్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కొండల్‌ యాదవ్‌, కార్యకర్తలు నిరాహార దీక్షకు దిగారు.

రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ ఎక్కడ ఉందని ప్రశ్నించిన కాలె యాదయ్య.. ఇప్పుడు అదే పార్టీలో చేరడం హాస్యాస్పదంగా ఉందని ఈ సందర్భంగా కొండల్‌ యాదవ్‌ విమర్శించారు. కాంగ్రెస్‌ పార్టీ కార్యకర్తలపై ఆయన గతంలో అనేక కేసులు పెట్టించాడని గుర్తుచేశారు. యాదయ్య చేరిక కాంగ్రెస్‌ పార్టీ కార్యకర్తల మనోభావాలను దెబ్బతీసేలా ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

 

బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే కాలె యాదయ్య ఢిల్లీలో సీఎం రేవంత్‌ రెడ్డి సమక్షంలో శుక్రవారం కాంగ్రెస్‌లో చేరారు. పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి దీపాదాస్‌ మున్షీతో కలిసి ఎమ్మెల్యే కాలె యాదయ్యను సీఎం రేవంత్‌రెడ్డి, పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌ వద్దకు తీసుకెళ్లి పార్టీ కండువా కప్పించారు. కాగా, పార్టీని వీడుతున్న కాంగ్రెస్‌ నేతలపై బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ శుక్రవారం కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీని వీడి దొంగలతో కలిసేటోళ్ల గురించి బాధలేదని.. తెలంగాణ సాధించిన మనకు గిదో లెక్కనా? అని వ్యాఖ్యానించారు. పార్టీయే నాయకులను తయారు చేస్తుంది తప్ప.. నాయకులు పార్టీని ప్రభావితం చేయలేరని స్పష్టం చేశారు. నాడైనా నేడైనా నాయకులను తయారు చేసుకున్నది పార్టీనే అని తెలిపారు. మెరికల్లాంటి యువ నాయకులను పార్టీ సృష్టిస్తదని చెప్పారు

Leave A Reply

Your email address will not be published.