కాళేశ్వరం దగ్గర గోదావరి నదికి వరద ఉధృతి

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: కాళేశ్వరం దగ్గర గోదావరి నదికి వరద ఉధృతి పెరుగుతున్నది. ఎగువన కురిసిన వర్షాల వల్ల కాళేశ్వరంలోని గోదావరి పుష్కర ఘాట్‌ వద్ద నదీ ప్రవాహం ఎక్కువవుతోంది. పై నుంచి 4.87 క్యూసెక్కుల ప్రవాహం వస్తూ 9.80 మీటర్ల ఎత్తుతో లక్ష్మీ బరాజ్‌ వైపు పరుగులు తీస్తున్నది. కాళేశ్వరం ప్రాజెక్ట్‌లోని అన్నారం బరాజ్‌లో 6 గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. బరాజ్‌ ఇన్‌ఫ్లో 15,468 క్యూసెక్కులు ఉంది. ఈ బరాజ్‌లో నీటి నిల్వ సామర్థ్యం 10.87 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 8.44 టీఎంసీల నీరు నిలువ ఉంది. లక్ష్మీ బరాజ్‌కు ఇన్‌ఫ్లో బాగా పెరగడంతో మొత్తం గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ఈ విషయాన్ని భారీ నీటి పారుదల శాఖ డీఈఈ సురేశ్‌ తెలిపారు. లక్ష్మీబరాజ్‌లో ప్రస్తుత నీటి మట్టం 5.70 మీటర్లుగా ఉందని ఆయన చెప్పారు.

Leave A Reply

Your email address will not be published.