జ్ఞాన స్వరూపిణి.. చదువుల తల్లి సరస్వతి దేవి

జ్ఞాన స్వరూపిణి,

చదువుల తల్లి సరస్వతీదేవి.
మహా సరస్వతీ ముక్తా,ముక్తిదా మోహనాశిని!
మహేశ్వరీ మహానందా,మహామంత్రమయీ మహీ;;అంటూ సరస్వతి .అంటూ వాగీశ్వరిని ధ్యానిస్తూ జ్ఞానాన్ని ప్రసాదించమని కోరిన కోర్కెలు తీర్చే సరస్వతి దేవి, మూలా నక్షత్రం లో అగుపిస్తుంది.బుద్ది వికాసిని అయిన ఆ తల్లి చిరునవ్వుతో సౌమ్యంగా, ప్రశాంతంగా గోచరిస్తుంది.పరిశీలనా శక్తితో, విచక్షణా జ్ఞానంతో ప్రకృతి పై పరిశీలనాత్మక దృష్టి ని సారిస్తుంది.విద్యను ముగించి యుక్తవయసుతో నిండుగా, కన్నుల పండువగా కనిపిస్తుంది.సమాజంపై అవగాహన పెంచుకుని పరిస్థితులను ఎలా ఎదుర్కోవాలో తనకు తెలుసుకున్న పరిపూర్ణ వ్యక్తిత్వం సరస్వతి అవతారంలో ఆ యమ్మ మనకు కనిపించే జ్ఞాన దాయిని ఆలయం గోదావరి నది తీరంలో తెలంగాణ రాష్ట్రం లో నిర్మల్ జిల్లా బాసర మండలం బాసర గ్రామంలో మహాకాళి, మహాలక్ష్మీ, సమేతంగా జ్ఞాన సరస్వతి అమ్మవారు కొలువై ఉన్న మహాక్షేత్రం బాసర. పక్కనే వ్యాస మహర్షి తపస్సు చేసిన గుహా కలదు. భారత దేశంలోని ప్రముఖ ఆలయాలలో ఒకటి. భారతదేశంలో రెండే రెండు ప్రముఖ దేవాలయాలలో ఒకటి కాశ్మీర్ లో మరోటి మన బాసర అమ్మవారి దేవాలయం. ఈ ఆలయం రాష్ట్ర రాజధానికి 200 కిలోమీటర్ల దూరంలో వుంటుంది. ఇక్కడి ఆలయం చాళుక్యుల కాలంలో నిర్మించబడిట్లు చారిత్రక ఆధారాలు ఉన్నాయి. ఈ ఆలయం సందర్శనార్థమై ఆంధ్రప్రదేశ్ మహారాష్ట్ర, ఒడిస్సా, మధ్యప్రదేశ్.రాష్ట్రాల నుండి అధిక సంఖ్యాకులు భక్తులు అమ్మవారిని దర్శించుకునేందుకు వస్తారు. ఈ ఆలయంలో చతుర్షష్టి అనగా 64 ఉపచారాలతో ఉదయ సాయంకాలలో వైదిక సంప్రదాయ పద్దతిలో వైభవంగా పూజలు నిర్వహిస్తారు. ఈ ఆలయంలో భక్తులకు ప్రధానంగా కేశ ఖండన, ఉపనయనాది కార్యక్రమాలతో పాటు, సంకీర్తనలు భజనలతో పాటు పుస్తకావిష్కరణలతో పాటు ,పండిత గోష్ఠి మున్నగు కార్యక్రమాలు నిరంతరం కొనసాగుతూనే వుంటాయి. వ(బ)సంత పంచమి నాడు అమ్మవారిని జన్మదినం. ఈవసంత పంచమి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తారు. ఈ నవరాత్రులలో.అనేక మంది భక్తులు ధవళ వస్త్రాలు ధరించి గోదావరి నదిలో స్నానాదికాలు ముగించుకొని అమ్మవారిని అమ్మవారిని దర్శించుకుని భుజాన జోలే ధరించి భిక్షాటన చేస్తూ ఏక భుక్తంతో దీక్షను పూర్తి చేసేవారు కొందరైతే.కొందరు అమ్మ వారి దీక్ష బూని ధవళ వస్త్రాలతో మాలను ధరించి 41 రోజులు మాలాధారులై కటిక నేలపై నిద్రిస్తూ,జప సంఖ్యను ఆధారం చేసుకుని జపం చేస్తూ, అనునిత్యం వారి స్థాయిని మరిచి అమ్మవారి పాదలచెంత కటిక నేలపై నిద్రిస్తూ పాదయాత్ర చేస్తూ అమ్మవారిని దర్శించుకునేందుకు వెళ్లి పూజాదికాలు పూర్తి గావించి మాలా విసర్జన చేసి దీక్షా విరమణ చేయడంతో వారికి సకల శుభాలు కలిగి అమ్మవారి కటక్షానికి పాత్రులై పామరులు సైతం పండితులుగా మారి ఎందరో కీర్తి పథాన వెలుగొందగలరని భక్తుల విశ్వాసం.

జ్ఞాన సరస్వతి జననం.
వ్యాస మహాముని తపో నిష్ఠుడై దండకారణ్యం లో ప్రయాణం చేస్తూ గోదావరి పరివాహక ప్రాంతం గుండా వెళ్తున్న వాడై త్రివేణీ సంగమం దాటి ప్రవహిస్తున్న నదీ తీరాన దీక్ష పూనిన ‌వాడై ప్రతినిత్యం నదిలో ప్రతినిత్యం స్నానమాచరించి గుప్పెడు ఇసుకను తెచ్చి బీజాక్షర ప్రదంగా ప్రతిష్ట చేసి పూజించిన అక్షర ప్రదాయిని ఈ చదువులమ్మ సరస్వతీదేవి. ఈ అమ్మవారికి మహార్ణవిమి రోజు చండీ హోమం నిర్వహిస్తారు ఈ హోమంలో అనేకమంది ఋత్విక్కులు, పీఠాధిపతులు పాల్గోంటారు.విజయదశమి రోజు సుందరమైన అలంకారం తో అమ్మవారు కొలువై వుంటారు. అక్కడి ఋత్విక్కులు వైదిక మంత్రాలతో మహాభిషేకం నిర్వహించి, సాయంకాలం సిమోల్లంగణ చేసి శమీ పూజ అనంతరం, అమ్మవారికి పల్లకి సేవ జరుగుతుంది.ఈ ఆలయ ప్రాంగణంలో నిరంతరం దుర్గా సప్తశతి, దేవి భాగవతం, శ్రీ దేవి స్తుతి, భాగవతం పారాయణాలు జరుగుతుంటాయి.ధార్మిక చర్చలు, ఉపన్యాసాలు,హరికథలు,పురాణ పఠనంతో పాటు నిత్యాన్నదానం జరుగుతుంది.ఆలయ ప్రాంగణంలో దీక్షా దారుల నిరంతరం వేధ పఠణం తో భక్తిమయంగా గోచరిస్తుంది.జ్ణాన ప్రసూనాంభ చేతిలో ఉన్న అఖండ జ్యోతికి నూనెను సమర్పిచుకోవడానికి భక్తులు ఆసక్తి కనబరుస్తారు.విధ్యార్తులు అక్షరాభ్యాసంతో పాటు పోటీ పరీక్షలకు వెల్లెముందు “దవుతి కాలం”సమర్పిస్తారు.విజయాలు సాధిస్తారు.

Leave A Reply

Your email address will not be published.