నకిలీ హాల్‌మార్క్‌తో బంగారు అభరణాలు.. తస్మాత్‌ జాగ్రత్త?

- గుర్తించడం ఎలా

Hallmarking-Gold1-copy1.JPG

☛ హాల్‌మార్కింగ్‌ అంటే ఏమిటి..?

☛హాల్‌మార్కింగ్‌ను ఎలా గుర్తిస్తారు..?

దీని వల్ల ఉపయోగం ఏమిటి?

కేంద్రం ఈ విధానాన్ని ఎందుకు తీసుకువచ్చింది

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్/ హైదరాబాద్ ప్రతినిధి:

బంగారం.. ఇది భారతీయ సాంప్రదాయంలో మహిళలు అత్యంత ప్రాధాన్యత ఇస్తుంటారు. ప్రతి రోజు బంగారం కొనుగోళ్లు జోరుగా సాగుతూనే ఉంటాయి. ఇక పండగలు, పెళ్లిళ్లు, ఇతర శుభకార్యాల సీజన్‌లో అయితే పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు. వినియోగదారులతో షాపులన్ని కిటకిటలాడుతుంటాయి. ఇక ప్రపంచంలోని రెండవ అతిపెద్ద ఆభరణాల మార్కెట్‌లోని వినియోగదారులు నకిలీ హాల్‌మార్క్ బంగారాన్ని కొనుగోలు చేసే ప్రమాదం తలెత్తుతతోందని, జాగ్రత్తలు తీసుకోకపోతే ఇది మార్కెట్‌ను ముంచెత్తుతుందని పరిశ్రమల సంఘం హాల్‌మార్కింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (HFI)కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసింది. అయితే ఇటీవల కాలంలో బంగారంపై హాల్‌మార్క్‌ విధానాన్ని కేంద్రం అందుబాటులోకి తీసుకువచ్చిన విషయం తెలిసిందే. ఈ విధానం బంగారం నాణ్యతను సూచిస్తుంది. అయితే బంగారం నిజమా.. లేదా నకిలీదా అనే విషయాన్ని తెలుసుకోవడం ఎంతో ముఖ్యం. బంగారం కొనుగోళ్ల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. లేదంటే మొదటికే మోసమొస్తుంది. బంగారంపై హాల్‌మార్కింగ్‌ను గుర్తించడం వల్ల బంగారం స్వచ్ఛతను గుర్తించవచ్చు. కేంద్ర ప్రభుత్వం హాల్‌మార్కింగ్‌ విధానం తీసుకువచ్చిన తర్వాత నకిలీ హాల్‌ మార్కింగ్‌ విధానంతో విచ్చల విడిగా నకిలీ బంగారు అభరణాల వ్యాపారం కొనసాగుతోందని ఆందోళన వ్యక్తం చేసింది.

హాల్‌మార్కింగ్ అంటే ఏమిటి..?

హాల్‌మార్కింగ్ అనేది బంగారం స్వచ్ఛతను గుర్తించే విధానం. బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (బీఐఎస్‌) చిహ్నం బంగారు ఆభరణాలపై ఉంటుంది. ఈ గుర్తు వల్ల బంగారం స్వచ్చతగా ఉంటుందని కేంద్ర ప్రభుత్వం ఉద్దేశించి ఈ విధానం అందుబాటులోకి తీసుకువచ్చింది. అందుకే హాల్‌మార్కింగ్‌ ఉన్న నగలు, బంగారాన్ని కొనుగోలు చేయాలని, ప్రతి షాపుల్లోని ఈ విధానం అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వం సూచించింది. ఈ విధానం అమలు చేయకపోతే వారిపై చర్యలు తప్పవని కూడా హెచ్చరించింది. దీంతో ఈ హాల్‌మార్క్‌ విధానం పకడ్బందీగా కొనసాగుతోంది. అయినా నకిలీ హాల్‌మార్క్‌ పేరుతో ఈ దందా వెలుగులోకి రావడంతో బీఐఎస్‌ అప్రమత్తం చేస్తోంది.

ప్రతి ఆభరణంలో బంగారం పరిమాణం మారుతూ ఉంటుంది. ఇది దాని స్వచ్ఛతపై ఆధారపడి ఉంటుంది. కొన్నిసార్లు నగల వ్యాపారులు తక్కువ క్యారెట్ ఆభరణాలకు ఎక్కువ క్యారెట్ ధరలను వసూలు చేస్తారు. దీన్ని తొలగించేందుకు హాల్‌మార్కింగ్‌ను తప్పనిసరి చేశారు.

నకిలీ హాల్‌మార్కింగ్‌లను ప్రభుత్వం అరికట్టాలి:

ప్రజలను మోసం చేయకుండా కాపాడేందుకు కేంద్ర ప్రభుత్వం బంగారు ఆభరణాలపై గోల్డ్ హాల్‌మార్కింగ్‌ను తప్పనిసరి చేసింది. దీని తర్వాత కూడా దేశంలోని మార్కెట్లలో కల్తీ బంగారు ఆభరణాలు విక్రయిస్తున్నారు. కొందరు మోసగాళ్లు నకిలీ హాల్‌మార్కింగ్‌ను ఏర్పాటు చేసి నాణ్యత లేని అభరణాలను విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. ఈ విషయంలో ప్రభుత్వం స్పందించి వారిపై చర్యలు తీసుకోవాలని పలువురు వ్యాపారవేత్తలు కోరుతున్నారు.

Leave A Reply

Your email address will not be published.