జావెలిన్‌ త్రోయర్‌ లోనీరజ్ చోప్రాకు గోల్డ్‌ మెడల్..

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: అథ్లెటిక్స్‌ చాంపియన్‌షిప్‌ లో భారత స్టార్‌ జావెలిన్‌ త్రోయర్‌ నీరజ్‌ చోప్రా సంచలన ప్రదర్శన నమోదు చేశాడు. హంగేరీ రాజధాని బుడాపెస్ట్‌ లో జరుగుతున్న మెగాటోర్నీలో నీరజ్‌ బరిసెను 88.17 మీటర్ల దూరం విసిరి అగ్రస్థానంలో నిలిచాడు.అథ్లెటిక్స్‌ చాంపియన్‌షిప్‌ లో భారత స్టార్‌ జావెలిన్‌ త్రోయర్‌ నీరజ్‌ చోప్రా సంచలన ప్రదర్శన నమోదు చేశాడు. హంగేరీ రాజధాని బుడాపెస్ట్‌ లో జరుగుతున్న మెగాటోర్నీలో ఆదివారం నీరజ్‌ బరిసెను 88.17 మీటర్ల దూరం విసిరి అగ్రస్థానంలో నిలిచాడు. దీంతో ప్రపంచ అథ్లెటిక్స్‌ ఛాంపియన్‌షిప్స్‌లో స్వర్ణం సాధించిన తొలి భారతీయుడిగా చరిత్ర సృష్టించాడు. అయితే ఈ విజ‌యంపై టీమిండియా మాజీ బ్యాట‌ర్ వీరేంద్ర సెహ్వాగ్ సోష‌ల్ మీడియా వేదిక‌గా స్పందించాడు.”విసిరితే ఎలా విసరాలి అంటే.. అందరు ఏం విసిరాడురా బాబు అనాలి. 88.17 మీటర్ల దూరం భలే విసిరినా మన ఛాంపియన్ నీరజ్ చోప్రా వరల్డ్ అథ్లెటిక్స్‌ ఛాంపియన్‌షిప్స్‌లో బంగారు పతకం గెలిచాడు. అంటూ వీరేంద్ర సెహ్వాగ్ ట్విట్ట‌ర్‌లో రాసుకోచ్చాడు. ప్ర‌స్తుతం ఈ పోస్టు వైర‌ల్‌గా మారింది.ఇదిలా ఉండ‌గా.. నిరుడు ఈ ప్రతిష్ఠాత్మక టోర్నీలో రజతం నెగ్గిన నీరజ్‌ ఈసారి పసిడి ముద్దాడాడు. క్వాలిఫయింగ్‌ రౌండ్‌లో మొదటి ప్రయత్నంలోనే బరిసెను 88.77 మీటర్ల దూరం విసిరి ఫైనల్‌కు చేరడంతో పాటు వచ్చే ఏడాది పారిస్‌ వేదికగా జరుగనున్న ఒలింపిక్స్‌కు అర్హత సాధించిన నీరజ్‌.. తుదిపోరులోనూ దుమ్మురేపాడు. పాకిస్థాన్‌కు చెందిన అర్షద్‌ నదీమ్‌ (87.82) రజతం నెగ్గగా.. చెక్‌కు చెందిన వద్లెచ్‌ (86.67) కాంస్యం చేజిక్కించుకున్నాడు. అయితే ఈ విజ‌యంపై టీమిండియా మాజీ బ్యాట‌ర్ వీరేంద్ర సెహ్వాగ్ సోష‌ల్ మీడియా వేదిక‌గా స్పందించాడు.

Leave A Reply

Your email address will not be published.