చికెన్ ప్రియులకు గుడ్ న్యూస్

తెలంగాణ జ్యోతి వెబ్ న్యూస్: చికెన్ ధరలు భారీగా తగ్గాయి. మెున్నటి వరకు చికెన్ ధరలు కొండెక్కి కూర్చున్నాయి. కార్తీక మాసం ముగియటంతో పాటు న్యూ ఇయర్ సందర్భంగా చికెన్ ధరలు ఆకాశన్నంటాయి. చికెన్‌తో పాటు గుడ్ల ధరలు కూడా భారీగా పెరిగాయి. కేజీ చికెన్.. రూ. 250 వరకు పలకగా.. గుడ్డు ఒక్కోటి రూ. 7-8 పలికింది. దీంతో మాసం కొనలేక, తినలేక మాంసం ప్రియులు చాలా ఉబ్బందులు పడ్డారు.ఇప్పుడా అవసరం లేదు. ఎందుకంటే చికెన్ ధరలు భారీగా తగ్గాయి. ప్రస్తుతం కిలో స్కిన్ లెస్ చికెన్ రూ. 150- 160 విక్రయిస్తున్నారు. విత్ స్కిన్ రూ. 120 పలుకుతోంది. డిమాండ్ కంటే సప్లయ్ ఎక్కువగా ఉండటంతో ధర తగ్గినట్లు తెలుస్తోంది. తగ్గిన ఈ ధరలు వచ్చే సంక్రాంతి వరకు ఇలానే కొనసాగితే పండగ సీజన్‌లో భారీ విక్రయాలు జరిగే అవకాశం ఉందని వ్యాపారులు అంచనా వేస్తున్నారు.అయితే అదే సమయంలో కూరగాయలు ధరలు మాత్రం విపరీతంగా పెరిగాయి. ప్రస్తుతం టమాటా, ఆలుగడ్డ మినహా అన్ని రకాల కూరగాయల ధరలు భారీగా పెరిగాయి. కేజీ రూ. 60-100 పలకుతున్నాయి. కేజీ టమాట రూ. 20 ఆలు రూ.30 పలుకుతోంది.

Leave A Reply

Your email address will not be published.