రైతులకు గుడ్‌న్యూస్‌.. నేడు పీఎం కిసాన్‌ డబ్బులు విడుదల చేయనున్న ప్రధాని మోడీ

PM-Kisan.jpg

ప్రధాని నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చాక దేశ ప్రజల కోసం ఎన్నో రకాల పథకాలను ప్రవేశపెడుతున్నారు. ఆర్థికంగా ఎంతో భరోసానిస్తున్నాయి పథకాలు. అయితే కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాల్లో పీఎం కిసాన్‌ సమ్మాన్‌ యోజన స్కీమ్‌ ఒకటి. ఇది రైతుల కోసం ప్రవేశపెట్టిన స్కీమ్‌. ఈ స్కీమ్‌లో రైతులకు ఏడాదికి రూ.6000 చొప్పున రైతులు అందుకుంటున్నారు. అయితే ఈ డబ్బులు మూడు విడతల్లో రూ.2000 చొప్పున రైతుల ఖాతాల్లో జమ చేస్తోంది కేంద్రం. ఈ నేపథ్యంలో ఇప్పటి వరకు రైతులు 11వ విడత డబ్బులు అందుకోగా, ఇప్పుడు 12వ విడత డబ్బులు రైతుల ఖాతాల్లో జమ కానున్నాయి. అక్టోబర్‌ 17(నేడు) ప్రధాని నరేంద్ర మోడీ ఢిల్లీలో పీఎం కిసాన్‌ డబ్బులను వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా విడదల చేయనున్నారు.

డబ్బుల గురించి ఇలా తనిఖీ చేసుకోండి..

☛ ముందుగా మీరు అధికారిక వెబ్‌సైట్ కి వెళ్లాలి

☛ దీని తర్వాత మీరు కుడి వైపున ‘ఫార్మర్స్ కార్నర్’ ఎంపికను చేసుకోవాలి.

☛ మీరు ‘బెనిఫిషియరీ స్టేటస్’ ఆప్షన్‌పై క్లిక్ చేయాలి.

☛ ఇక్కడ కొత్త పేజీ ఓపెన్‌ అవుతుంది.

☛ ఇప్పుడు మీరు మీ ఆధార్ నంబర్, బ్యాంక్ ఖాతా నుండి ఏదైనా ఒక ఎంపికను ఎంచుకోవాలి. తర్వాత డేటాపై క్లిక్‌ చేస్తే వివరాలు వస్తాయి.

Leave A Reply

Your email address will not be published.