తెలంగాణాలో గ్రామీణ ప్రాంతాలకు గుడ్ న్యూస్

తెలంగాణ జ్యోతి వెబ్ న్యూస్: తెలంగాణ ఏర్పాటయ్యాక రాష్ట్రంలోని గ్రామాల్లో అభివృద్ధి వేగం పుంజుకుంది. చాలా వరకు గ్రామాలకు మంచి రోడ్డు సదుపాయం, ఇంటింటికి తాగునీరు అందుబాటులోకి వచ్చాయి. మారుమూల పల్లెల్లో సైతం మౌలిక వసతులు మెరుగయ్యాయి. అయితే ఇప్పటికీ చాలా గ్రామాల్లో పాఠశాల, వైద్య సదుపాయం, మురుగునీటిపారుదల లాంటి సదుపాయాలు అన్ని గ్రామాల్లో అందుబాటులో లేవు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని అన్ని గ్రామాల్లో కనీస సదుపాయాలు కల్పించాలని రేవంత్ రెడ్డి సర్కారు యోచిస్తోంది. రెవెన్యూ గ్రామం ఒక యూనిట్‌గా.. అక్కడి ప్రజల అవసరమైన సదుపాయాలన్నీ కల్పించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇందుకు గానూ ఏయే గ్రామాల్లో ఏయే సదుపాయాలు ఉన్నాయి.. ఇంకా ఏయే సదుపాయాలు కల్పించాల్సి ఉందనే సమాచారం సేకరించనున్నారు.

Leave A Reply

Your email address will not be published.