భవన నిర్మాణ కార్మికులను ప్రభుత్వం ఆదుకోవాలి

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: గత  పది రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నందున ,  పనులు ఆగిపోవడం వల్ల రెక్కడి తేగానే డొక్కాడని భవన నిర్మాణ కార్మికులు, తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని బీసీ సేన రాష్ట్ర అధ్యక్షులు బూరుగుపల్లి కృష్ణ యాదవ్ ఆవేదన వ్యక్తం చేశారు. విద్యా నగర్ బీసీ భవన్ విలేకరులతో ఆయన మాట్లాడుతూ కార్మిక శాఖ ద్వారా గుర్తింపు కార్డులు పొందిన కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం ఒక్కో కార్మికుడికి 5వేల రూపాయల నగదు, ఒక నెలకు సరిపోను నిత్యవసర సరుకులు అందించిఆదుకోవాలని,ముంపు ప్రాంతాల్లో నివసిస్తున్నకార్మికులకు పునరావాసం కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు.రాష్ట్ర అభివృద్ధిలో ముఖ్య భూమిక పోషిస్తున్నభవన నిర్మాణ కార్మికులకు, రాష్ట్ర ప్రభుత్వం పక్కా ఇల్లు నిర్మించే ఇవ్వాలని , కార్మికుల పిల్లలకు రాష్ట్ర ప్రభుత్వం ఉచిత విద్యా, వైద్యం అందించాలని ,  కార్మికులకు ప్రమాద బీమా పథకానికి 10 లక్షల రూపాయలు కేటాయించాలని కృష్ణ యాదవ్ డిమాండ్ చేశారు..

Leave A Reply

Your email address will not be published.