విద్యార్థులను అభినందించిన గవర్నర్

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: రాజ్ భవన్ లో నిర్వహించిన G-20 సదస్సుకు సంబంధించిన పోటీలకు విద్యార్థుల నుండి అనూహ్య స్పందన రావడం పట్ల గవర్నర్ డాక్టర్ (శ్రీమతి) తమిళిసై సౌందరరాజన్ ఆనందం వ్యక్తం చేశారు.రాష్ట్రంలోని వివిధ విశ్వ విద్యాలయాల నుండి నాలుగు వందలకు పైగా విద్యార్థులు వివిధ పోటీలలో ఉత్సాహం గా పాల్గొన్నారు.భారత దేశం అత్యంత శక్తివంతమైన G-20 దేశాలకు అధ్యక్షత వహించడంమన దేశానికి గొప్ప అవకాశం అని గవర్నర్ అన్నారు.పోటీలలో పాల్గొన్న విద్యార్థుల ప్రతిభ పాటవాలకు తాను ముగ్దురాలైనట్లు డాక్టర్ తమిళిసై సౌందరరాజన్ సంతోషం వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా విద్యార్థులు చూపిన సృజనాత్మకతవిషయ పరిజ్ఞానం అద్బుతంగా ఉన్నాయని ఆమె ప్రశంసించారు.విజేతలకు బహుమతులుకొంత క్యాష్ ప్రైజ్ కూడా గవర్నర్ పంపిణీ చేశారు.G-20 కి భారత్ అధ్యక్షత వహించే ఈ సంవత్సర కాలంలో విభిన్నమైన కార్యక్రమాలతో భారత దేశ ఖ్యాతిని ప్రపంచానికి తెలియజేయడానికి కృషి చేయాలని గవర్నర్ పిలుపునిచ్చారు.రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలలో మన రాష్ట్రదేశ గొప్పతనాన్ని తెలియజేసే కార్యక్రమాలతో విదేశీ ప్రతినిధులకు మన కీర్తిని చాటాలని గవర్నర్ ఒక ప్రకటన లో పిలుపునిచ్చారు.

Leave A Reply

Your email address will not be published.