తెలంగాణ, తమిళనాడు ముఖ్యమంత్రులపై గవర్నర్ తమిళిసై తీవ్ర స్థాయిలో విమర్శలు

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: పంద్రాగస్టు సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై.. రాష్ట్ర గవర్నర్ తమిళిసై మరోసారి తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా చెన్నైకి వెళ్లిన గవర్నర్ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా గవర్నర్ ఇచ్చే తేనీటి విందుకు తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ గైర్హాజరయ్యారు. కార్యక్రమంలో భాగంగా మీడియాతో మాట్లాడుతూ.. అటు తమిళనాడు, ఇటు తెలంగాణ ముఖ్యమంత్రులపై కీలక వ్యాఖ్యలు చేశారు. గవర్నర్ ఇచ్చే తేనీటి విందుకు సీఎం గైర్హాజరవడం మంచిదికాదన్నారు. స్టాలిన్ రాకపోవడం నిజంగా బాధాకరమని తమిళిసై చెప్పుకొచ్చారు.రాజ్ భవన్‌లో తేనీటి విందుకు కేసీఆర్‌ను ఆహ్వానించామని గవర్నర్ తెలిపారు. అయితే సీఎం రావడం, రాకపోవడం అనేది రాజ్ భవన్ పరిధిలో లేదని గవర్నర్ చెప్పుకొచ్చారు. ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వ వైఖరి తనను తీవ్రంగా బాధించిందని తమిళిసై ఒకింత ఆవేదన వ్యక్తం చేశారు. గవర్నర్లపై ముఖ్యమంత్రుల తీరు ఇలా ఉండటం ఎప్పటికి మంచిది కాదన్నారు. కాగా.. ఇవాళ్టి తేనేటి విందు కార్యక్రమానికి కూడా కేసీఆర్ దూరంగా ఉన్నారు. రాజ్‌భవన్ నుంచి ప్రగతి భవన్‌కు ఆహ్వానం వెళ్లినప్పటికీ ఇంతవరకూ ఎలాంటి స్పందన రాలేదు. కనీసం ప్రభుత్వం తరఫున ఒకరిద్దరు మంత్రులు కానీ.. లేదా సీఎస్‌ వెళ్తారనే దానిపై కూడా ఇంతవరకూ ఎలాంటి సమాచారం రాకపోవడం గమనార్హం.

Leave A Reply

Your email address will not be published.