దేశంలో అన్ని రాష్ట్రాల్లో ఒకే విధంగా గ్రామపంచాయతీ వ్యవస్థ ఉండాలి

   అఖిల భారత పంచాయతీ పరిషత్ డిమాండ్

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: దేశంలో అన్ని రాష్ట్రాల్లో ఒకే విధంగా గ్రామపంచాయతీ వ్యవస్థ ఉండాలని అఖిల భారత పంచాయతీ పరిషత్ డిమాండ్ చేసింది.అఖిల భారత పంచాయతీ పరిషత్ (న్యూఢిల్లీ) సౌత్ ఇండియా జోనల్ కాన్ఫరెన్స్ బెంగళూరులో శేషాద్రిపురం లో గల గాంధీభవన్ కాన్ఫరెన్స్ హాల్లో ఈరోజు ఘనంగా జరిగినది. తొలుత ఆవరణలో ఉన్న మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాలలతోటి  నివాళులర్పించినారు.అనంతరం భారత దేశంలో అన్ని రాష్ట్రాల్లో గ్రామపంచాయతీ వ్యవస్థ ఒకే విధంగా ఉండాలని అఖిల భారత పంచాయతీ పరిషత్ (న్యూఢిల్లీ) సెక్రెటరీ జనరల్ , కేంద్ర పంచాయతీరాజ్ మరియు గ్రామీణ అభివృద్ధి శాఖ మాజీ ఎక్స్పర్ట్ కమిటీ మెంబర్ ఎస్ ఎస్ విజయ్ మిశ్రా మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం 73వ రాజ్యాంగ సవరణలను ఎన్ని రాష్ట్రాల్లో 29 అంశాలను రాష్ట్ర ప్రభుత్వాలు బదిలీ చేసినవో లేదో సమీక్ష చేసి వాటి మీద చర్యలు కూడా తీసుకోవాలని సంపూర్ణంగా 29 అంశాలను కూడా గ్రామపంచాయతీ సర్పంచ్ ఆధీనంలో ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశాల్లో ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల  స్థానిక సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు వారు రాష్ట్రాల్లో జరుగుతున్న పంచాయతీరాజ్ వ్యవస్థ గ్రామపంచాయతీలలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు గురించి విపులంగా చర్చించారు. ఈ సమావేశానికి సభాధ్యక్షులుగా అఖిల భారత పంచాయతి పరిషత్ (న్యూఢిల్లీ) జాతీయ ఉపాధ్యక్షులు డాక్టర్ జాస్తి వీరాంజనేయులు వ్యవహరించారు. అఖిల భారత పంచాయతీ పరిషత్ (న్యూఢిల్లీ) జాతీయ ఉపాధ్యక్షులు మరియు ఆంధ్రప్రదేశ్  పంచాయతీ పరిషత్ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ జాస్తి వీరాంజనేయులు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ నుంచి ఆంధ్రప్రదేశ్ పంచాయతీ పరిషత్ రాష్ట్ర ఉపాధ్యక్షులు రామకృష్ణారెడ్డి గారు సుదీర్ఘంగా ప్రసంగించినారు. ఆంధ్రప్రదేశ్లో పంచాయతీరాజ్ వ్యవస్థ చాలా అద్వాన స్థితిలో ఉన్నదని గ్రామ సర్పంచులకు ఏ విధమైన విధులు నిధులు అధికారాలు లేకుండా ఇబ్బందులు పడుతున్నారని ఈ సమావేశం దృష్టికి తీసుకువచ్చారు. ఆంధ్రప్రదేశ్ పంచాయతీ పరిషత్ ప్రధాన కార్యదర్శి కొత్తపు ముని రెడ్డి  మాట్లాడుతూ  గ్రామపంచాయతీ సర్పంచ్ ఎన్నికలలో ఇద్దరకంటే ఎక్కువ పిల్లల నియమావళిని సవరించాలని పిల్లలు ఎంతమంది ఉన్నా ఎన్నికల్లో పోటీ చేసే విధంగా చర్యలు తీసుకోవాలని సమావేశం దృష్టికి తీసుకువచ్చారు. ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క రకంగా ఉన్నదని చాలా రాష్ట్రాల్లో ఈ పిల్లల నిబంధనలు లేవని ఈ సందర్భంగా తెలిపారు. కర్ణాటక పంచాయతీరాజ్ వార్డ్ మెంబర్స్ ఫెడరేషన్ ప్రధాన కార్యదర్శి మరియు అఖిలభారత పంచాయతీ పరిషత్ జాతీయ కార్యదర్శి ఏయం చలపతి మాట్లాడుతూ గ్రామపంచాయతీల్లో గతంలోని సమస్యల పట్ల మేము ట్రైనింగ్ లు కూడా ఇప్పించాము సర్పంచులు కి, వార్డు మెంబర్లకు, ఉప సర్పంచ్ లకు గౌరవ వేతనాలు కూడా పెంచే విధంగా కృషి చేసినామని తెలిపారు పంచాయతీ పరిషత్ బలోపేతం చేసే విధంగా కృషి చేస్తానని కూడా తెలిపారు పరిషత్ కార్యదర్శి, దాడి ఎరుకు నాయుడు, సంయుక్త కార్యదర్శి గోళ్ళ మల్యాద్రి నాయుడు తమ  అభిప్రాయాలను కూడా సుదీర్ఘంగా తెలిపారు. ఈ సమావేశంలో పలు తీర్మానాలను ఆమోదించినారు.

తీర్మానాలు

 1- భారత ప్రభుత్వం మరియు రాష్ట్రాలు ప్రాధాన్యతపై అధికారాలు/ విధులను పూర్తి మరియు ప్రభావవంతంగా పంపిణీ చేసేలా చూడాలి.

 2- బలమైన శాసనసభ ఫ్రేమ్ వర్క్ ద్వారా ఫంక్షన్ల డెవల్యూషన్.

 3- జిల్లా పంచాయతీ {జిల్లా పరిషత్}తో DRDAల ప్రగతిశీల విలీనం

 4- రాష్ట్ర మరియు కేంద్ర రాజ్యాంగ బాధ్యత {243-1} ఎన్నికైన స్థానిక సంస్థల ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడానికి కలిసి పని చేయాలి.

 5- గ్రామసభ/వార్డు సభల అర్థవంతమైన సాధికారత, ప్రత్యేక మహిళా {మహిళల} సభ సమావేశాల ఏర్పాటుచేయాలి

 6- ప్రతి శ్రేణి మరియు మునిసిపాలిటీలలో పంచవర్ష దృక్పథ ప్రణాళిక మరియు వార్షిక ప్రణాళికల తయారీ మరియు DPC {జిల్లా ప్రణాళికా సంఘం} ద్వారా ఏకీకరణ.

 6- ఆర్థికాభివృద్ధి మరియు సామాజిక న్యాయం మరియు 11వ షెడ్యూల్‌కు సంబంధించిన విషయాలపై అప్పగించబడిన కార్యక్రమాలను అమలు చేయడానికి PRIలు.

 7- PESA యొక్క నిబంధనలను అమలు చేయడానికి టైమ్ బౌండ్ ఫ్రేమ్ వర్క్.ఉండాలి

  8-ఎస్సీ/ఎస్టీలకు వారి జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్ కల్పించాలి.

 9-పంచాయతీ నివేదికల వార్షిక స్థితిని రాష్ట్రవ్యాప్తంగా పోల్చదగినదిగా చేయడం.

 10-ఫండ్ ఫ్లో కంటే PRIల ద్వారా ఫండ్ మేనేజ్‌మెంట్ మరియు ఫండ్ ట్రాకింగ్‌పై దృష్టి పెట్టండి.

 11 – గ్రామ పంచాయతీ స్థాయిలో మరియు ఉన్నత స్థాయి PRIల వద్ద సామాజిక తనిఖీని తప్పనిసరిగా చేపట్టాలి.

 12- నిరంతర ప్రక్రియలో జాతీయ మరియు రాష్ట్ర మరియు స్టాండింగ్ కమిటీ సభ్యులతో సహా అన్ని స్థాయిలలో PRI కార్యనిర్వాహకులు మరియు ఎన్నికైన ప్రతినిధులందరికీ శిక్షణ.

 వివిధ రాష్ట్రాల స్థానిక సంస్థల  ప్రతినిధులను కర్ణాటక రాష్ట్ర సంస్కృతి ప్రకారం శాలువాతో  పూల దండలుతో మైసూర్ పేటా తో పాటు ఏ ఏం చలపతి మరియు కర్ణాటక సర్పంచులను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో అఖిల భారత పంచాయతీ పరిషత్( న్యూఢిల్లీ) సెక్రెటరీ జనరల్, & కేంద్ర పంచాయతి రాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖ మాజీ ఎక్స్పర్ట్ కమిటీ మెంబర్ ఎస్ఎస్ విజయ మిశ్రా, అఖిల భారత పంచాయతీ పరిషత్ (న్యూఢిల్లీ) జాతీయ ఉపాధ్యక్షులు మరియు ఆంధ్రప్రదేశ్ పంచాయతీ పరిషత్ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ జాస్తి వీరాంజనేయులు, కర్ణాటక గ్రామపంచాయతీ వార్డు మెంబర్స్ ఫెడరేషన్ జనరల్ సెక్రటరీ మరియు అఖిలభారత పంచాయతీ పరిషత్ కార్యదర్శి  ఏ ఏం చలపతి, ఆంధ్రప్రదేశ్ పంచాయతీ పరిషత్ రాష్ట్ర ఉపాధ్యక్షులు ముల్లంగి రామకృష్ణారెడ్డి, ఆంధ్ర ప్రదేశ్ పంచాయతీ పరిషత్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొత్తపు మునిరెడ్డి, కార్యదర్శి దాడి ఎరుక నాయుడు, సంయుక్త కార్యదర్శి గోళ్ళ మాల్యాద్రి నాయుడు, అనకాపల్లి జిల్లా పరవాడ మండల రావాడ గ్రామ పంచాయతీ సర్పంచ్ మోటూరు సన్యాసి నాయుడు,  వివిధ రాష్ట్రాల సర్పంచులు నేత్ర, అనంతరాజు, వార్డు మెంబర్ రంగమ్మ, సంఘ సేవకులు,మాలేంపాటి జితేంద్ర, జే అమర్ శేషేంద్ర తదితరులు పాల్గొన్నారు

Leave A Reply

Your email address will not be published.