గృహలక్ష్మి పథకం నిరంతర పథకంగా మార్చాలి

- జోగులాంబ గద్వాల జిల్లా బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు తట్టే మహేష్

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: గృహలక్ష్మి పథకం నిరంతర పథకంగా మార్చాలని,దీనిని నిరంతరంగ ఈ ప్రక్రియ కొనసాగేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని జోగులాంబ గద్వాల జిల్లా బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు తట్టే మహేష్ డిమాండ్ చేసారు.రాష్ట్రం లో లక్షల మంది నిరుపేదలు సరైన గూడు లేక ఎండకు వానలకు ఇబ్బందులు పడుతున్నారన్నారు. బీసీలకు లక్ష రూపాయలు ఇస్తంటివి అది కూడా నామ మాత్రం అయిపోయిందని, రాష్ట్ర వ్యాప్తంగా 4 శాతం ప్రజలకు డబుల్ బెడ్ రూమ్ లు ఇచ్చి చేతులు దులుపుకోవడం సిగ్గుచేటన్నారు.అందుకే గృహలక్ష్మి పథకం నిరంతరం పథకంలో మార్చాలన్నారు.- వైన్ షాప్ టెండర్లకు మాత్రం 15 రోజుల గడువు.. గృహలక్ష్మి పథకం మాత్రం ప్రభుత్వం నాలుగు రోజులు గడువు ఇవ్వడం సిగ్గుచేటన్నారు.గురువారం మీడియా సమావేశం లో ఆయన మాట్లాడుతూ గృహలక్ష్మి పథకం ప్రవేశపెట్టి నాలుగు రోజులు గడువు ఇవ్వడం సిగ్గు చేటు అని,అలాగె పథకం గడువు పెంచాలని డిమాండ్ చేసారు.తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన గృహలక్ష్మీ పథకం అమలులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా  దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. దరఖాస్తు ఈ నెల 10 వ తేదీ వరకే ఇవ్వడం సరికాదు,గడువు పెంచాలని  డిమాండ్ చేస్తున్నాం అని అన్నారు. రాష్ట్రం లో లక్షల మంది నిరుపేదలు సరైన గూడు లేక ఎండకు వానలకు ఇబ్బందులు పడుతున్నారు. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అధికారంలోకి వచ్చినాక రాష్ట్రం లో ప్రతి పేద వారికి డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళు కట్టిస్తామని చెప్పి 10 సంవత్సరాలు గడిచింది. రాష్ట్ర వ్యాప్తంగా 4 శాతం ప్రజలకు డబుల్ బెడ్ రూమ్ లు ఇచ్చి చేతులు దులుపుకొని. ఇప్పుడు గృహలక్ష్మి పథకం ప్రవేశపెట్టి నాలుగు రోజులు గడువు ఇవ్వడం సిగ్గు చేటూ అని అన్నారు. నిజంగా ప్రభుత్వానికీ చిత్త శుద్ధి ఉంటే ఇళ్ళు లేని ప్రతి పేదవారు ఇళ్ళు నిర్మించుకునేందుకు నిరంతర ప్రక్రియ గా ఈ పథకాన్ని కొనసాగించాలని  తట్టే మహేష్ డిమాండ్ చేసారు.

Leave A Reply

Your email address will not be published.