జీఎస్‌ఎల్వీ ఎఫ్-12 రాకెట్ ప్రయోగం విజయవంతం…

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: శ్రీహరికోటలోని షార్ అంతరిక్ష కేంద్రం నుంచి జీఎస్‌ఎల్వీ ఎఫ్-12 రాకెట్ ప్రయోగం విజయవంతమైంది. సోమవారం ఉదయం షార్ రాకెట్ ప్రయోగ కేంద్రంలోని సెకండ్ లాంచ్ ప్యాడ్ నుంచి సరిగ్గా 10:42 గంటలకు నిప్పులు చెరుగుతూ రాకెట్ నింగిలోకి దూసుకెళ్లింది. ఆపై నిర్ణీత సమయంలో ఎన్‌వీఎస్ – 01 ఉపగ్రహాన్ని రాకెట్ కక్ష్యలోకి ప్రవేశపెట్టింది. ఈ ఉపగ్రహం దేశీయ నేవిగేషన్ సేవలు అందించనుంది. జీఎస్ఎల్వీ ఎఫ్ – 12 రాకెట్ పొడవు 51.7 మీటర్లు, బరువు 420 టన్నులు. రాకెట్ ప్రయోగం సక్సెస్ అవడంతో సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రంలోని మిషన్ కంట్రోల్ సెంటర్‌లో శాస్త్రవేతల సంబరాలు చేసుకుంటున్నారు. రాకెట్ ప్రయోగం విజయవంతంపై సహచర శాస్త్రవేత్తలను ఇస్రో చైర్మన్ డా.సోమనాథ్ అభినందించించారు. ఈ సందర్భంగా ఇస్రో చైర్మన్ మాట్లాడుతూ.. జీఎస్‌ఎల్వీ ఎఫ్-12 రాకెట్ ప్రయోగం విజయవంతమైందని తెలిపారు. ఇది ఇస్రో సభ్యుల కృషి వల్లే సాధ్యమైందన్నారు. ఎన్‌వీఎస్ – 01 ఉపగ్రహం నిర్దేశిత కక్ష్యలోకి చేరిందని చెప్పారు. రాకెట్ ప్రయోగంలో క్రయోజనిక్ స్టేజి చాలా కీలకమైందని… ఆ స్టేజ్‌ కూడా సవ్యంగా సాగిందని ఇస్రో చైర్మన్ డా.సోమనాథ్ పేర్కొన్నారు.

Leave A Reply

Your email address will not be published.