నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలిపిన గెస్ట్ టీచర్లు

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్/ బిర్కూర్ ప్రతినిధి: బిర్కూర్ మండలకేంద్రంలోని మహాత్మ జ్యోతిబాపూలే గురుకుల పాఠశాలలో గెస్ట్ టీచర్స్ పేరుతో ఫుల్ టైం టీచర్స్ గా విధులు నిర్వహిస్తున్న ఉపాధ్యాయులు గురువారం గెస్ట్ టీచర్లు అందరూ నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన  తెలిపారు. 28-10-2022 రోజున నుండి సొసైటీ రూల్స్ ప్రకారంగా 4 పీరియడ్స్ లేదా మధ్యాహ్నం 1:30 కి వెలుతు సొసైటీ రూల్స్ ను గౌరవిద్దామని నిర్ణయించుకున్నారు.  ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ

1. ఎన్నడూ లేని విధంగా ఈ సంవత్సరం దసరా సెలవుల్లో జీతాలు కోత పెట్టడం పీరియడ్స్ లెక్కన 64 పీరియడ్స్ కు జీతాలు ఇవ్వడం అనేది మాకు మనోవేదన కలిగిస్తుందని. పూర్తి వేతనం చెల్లించగలరని పై అధికారులకు వినతి పత్రాలు సమర్పించిన ఎలాంటి స్పందన లేకపోవడం మనోవేదనకు గురి చేస్తున్దన్నారు.

2.మన శ్రమను గుర్తించి కోతలు లేని వేతనం చెల్లించి న్యాయం చేయమని ప్రిన్సిపల్స్ ద్వారా ప్రిన్సిపల్ సెక్రెటరీ సార్ గారికి సెక్రెటరీ సార్ గారికి ఆర్ సి ఓ సార్ గారికి ప్రతి పాఠశాలలో వినతి పత్రాలు సమర్పించిన వాట్సప్ ల ద్వారా కూడా వినతి పత్రాలు సమర్పించిన ఎలాంటి స్పందన లేకపోవడం బాధ కలిగిస్తున్నటువంటి విషయం.

3. నిజానికి మమ్మల్ని గెస్ట్ ప్రాతిపాదికన తీసుకున్నది నెలకు 25 రోజులు రోజుకు నాలుగు పీరియడ్స్ చొప్పున పీరియడ్ కు 240 రూపాయల చొప్పున రోజుకు 960 రూపాయల చొప్పున నెలకు 24000/- వేల రూపాయలు వేతనం చెల్లిస్తున్నారు.

4. ఇలా మేము రోజుకు నాలుగు పీరియడ్స్ చెప్పుకొని వెళ్లిపోవాలి కానీ గెస్ట్ పేరుతో ఫుల్ టైం టీచర్స్ గా రెగ్యులర్ వాళ్ళతో సమానంగా పనిచేయించుకుంటున్నారు.

5. తాము అదనంగా కిట్ ఇన్స్పెక్షన్ డ్యూటీ, క్లాస్ టీచర్స్ డ్యూటీ, హౌస్ మాస్టర్స్ డ్యూటీ, సండే డ్యూటీ, హాలిడే డ్యూటీ, డే స్టడీ అవర్, నైట్ స్టడీ అవర్, నైట్ కేర్ డ్యూటీ,
ఇలా ఎన్ని డ్యూటీలు చేసినా అదనంగా వీటికి ఒక్క రూపాయి కూడా ఇవ్వరు.
ఇది లెక్కలోకి కూడా రాదు. ఇలా ఎంతో ఒత్తిడిలో కూడా విధులను నిర్వహించిన ఎలాంటి గుర్తింపు లేదు అని ఆవేదన వ్యక్తం చేశారు.

6.ఇవి మాత్రమే కాకుండా రోజుకు 4 పీరియడ్స్ మాత్రమే చెప్పాల్సిన మేము 5,6,7 పీరియడ్స్ కూడా బోధిస్తున్నాం. ఇంకా దారుణమైన విషయం ఏమిటంటే కొన్ని జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో కొన్ని పాఠశాలల్లో
2 సెక్షన్లను క్లబ్ చేసి 4 నుంచి 6 పీరియడ్స్ చెప్పిస్తున్నారు. ఒక్కో సెక్షన్ లో 40 మంది క్లబ్ చేస్తే 80 మంది విద్యార్థులు ఉంటారు.
అయినా సరే వీటన్నిటిని ఓర్చుకొని ఎంతో ఒత్తిడికి లోనవుతున్న బాధకు గురవుతున్న విద్యార్థులకు విద్యను బోధిస్తున్నాము.
ఇంకా ఇవే కాకుండా మా బాధలు కొన్ని చెప్పుకోలేనటువంటి పరిస్థితిలో ఉన్నాయన్నారు. ప్రబుత్వం తమ సమస్యలను వెంటనే పరీష్కరించాలని వారు కోరారు.

Leave A Reply

Your email address will not be published.